‘మాసుగాడి మనసుకే ఓటేశావే’.. చిట్టి సాంగ్ విన్నారా!..

‘మాసుగాడి మనసుకే ఓటేశావే’.. చిట్టి సాంగ్ విన్నారా!..

Chitti Lyrical Video: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. స్వప్న సినిమాతో కలిసి, ‘జాతిరత్నాలు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.

ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న ‘జాతిరత్నాలు’ సినిమాలో నుండి రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘చిట్టీ’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రథన్ ట్యూన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. రామ్ మిర్యాల చాలా చక్కగా పాడారు.

Jathi Ratnalu

‘‘యుద్ధమేమీ జరగలే.. సుమోలేవీ అస్సలెగరలే.. చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే.. మేడమ్ ఎలిజబెత్ నీ రేంజ్ అయినా.. తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా.. మాసుగాడి మనసుకే ఓటేశావే.. బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేశావే.. తీన్‌మార్ చిన్నోడినీ డీజే స్టెప్పులు వేయిస్తివే’’.. వంటి లిరిక్స్ బాగున్నాయి.

నవీన్, ఫరియా అబ్దుల్లా పెయిర్ కూడా క్యూట్‌గా ఉంది. అనుదీప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘జాతి రత్నాలు’ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.