Vikram: రీల్ విక్రమ్ కోసం రియల్ విక్రమ్.. నిజమేనా?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

Vikram: రీల్ విక్రమ్ కోసం రియల్ విక్రమ్.. నిజమేనా?

Chiyaan Vikram To Star In Kamal Haasan Vikram 2 Movie

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

Vikram : చియాన్ 61.. పల్లెటూరి వ్యక్తిగా విక్రమ్ ‘తంగలాన్’.. గ్లింప్స్ రిలీజ్..

కేవలం తమిళంలోనే కాకుండా, ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే ఈ సినిమాలో హైలైట్ అంశంగా మరో స్టార్ హీరో సూర్య ఎంట్రీ నిలిచిందని అందరికీ తెలిసిందే. రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ థియేటర్లలో విజిల్స్ వేయించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా విక్రమ్-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాలో సూర్య ఫుల్‌లెంగ్త్ విలన్ పాత్రలో నటించబోతున్నాడని చిత్ర యూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ వర్గల్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలోనూ మరో హీరో ఎంట్రీ ఉండబోతుందని.. ఆ హీరో ఎంట్రీ రోలెక్స్ ఎంట్రీని మించి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ హీరో మరెవరో కాదు.. చియాన్ విక్రమ్ అని తెలుస్తోంది. ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో విక్రమ్ నటిస్తే, ఆ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో అందరికీ తెలిసిందే. దీంతో విక్రమ్ కోసం ఓ ప్రత్యేక లుక్‌తో పాటు ప్రత్యేక పాత్రను కూడా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు లోకేశ్. మరి నిజంగానే రీల్ విక్రమ్ కోసం రియల్ విక్రమ్ ఎంట్రీ ఇస్తాడా లేడా అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.