గొర్రెల్లా ఇంజనీరింగ్ చేయడం నావల్ల కాదు : ‘చూసీ చూడంగానే’ – టీజర్

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ‘చూసీ చూడంగానే’ టీజర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 6, 2019 / 06:15 AM IST
గొర్రెల్లా ఇంజనీరింగ్ చేయడం నావల్ల కాదు : ‘చూసీ చూడంగానే’ – టీజర్

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ‘చూసీ చూడంగానే’ టీజర్ విడుదల..

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి.. ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ.. ధర్మపత్ని క్రియేషన్స్ బ్యానర్‌లో ‘చూసీ చూడంగానే’ అనే సినిమా నిర్మిస్తున్నారాయన. రాజ్ కందుకూరి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అసోషియేషన్‌లో రిలీజవనుంది. తమిళనాట ‘96’ ‘బిగిల్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది.

క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వంటి దర్శకుల దగ్గర పనిచేసిన శేష సింధు దర్శకురాలిగా పరిచయమవుతుంది. బుధవారం (నవంబర్ 6) ‘చూసీ చూడంగానే’ టీజర్ రిలీజ్ చేశారు.. ‘కొడుకు వల్ల కాదని మేనేజ్‌మెంట్ కోటాలోఇంజనీరింగ్ సీట్ కొనే పేరెంట్స్, గొర్రెల్లా ఇంజనీరింగ్ చేయడం నా వల్ల కాదు.. నేనేదైనా క్రియేటివ్‌గా చేస్తాను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే కొడుకు.. బలవంతంగా కాలేజీకి వెళ్లడం, అక్కడ లవ్.. చివరకి అతని గోల్ ఏంటి, దాన్ని రీచ్ అవడానికి అతనేం చేశాడు’.. ఇదీ క్లుప్తంగా సినిమా కథ అని టీజర్ ద్వారా అర్థమవుతుంది..

Read Also : ‘నా భర్తని నేనే చంపేశాను’ : రాగల 24 గంటల్లో – ట్రైలర్

శివ యాక్టింగ్, ఎక్స్‌‌ప్రెషన్స్ బాగున్నాయి.. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, ఆర్ఆర్, విజువల్స్ కూడా బాగున్నాయి.. మాళవికా సతీషన్, ప్రగతి, అనీష్ కురువిల్లా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. వేద రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ‘చూసీ చూడంగానే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.