Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు షాకిచ్చిన గూగుల్

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు తెలియని సినీ, టీవీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఎంద‌రో స్టార్ హీరోల‌కు ఆయ‌న ఫేవ‌రెట్ డ్యాన్స్ మాస్టర్. తన స్టెప్పుల‌తో వెండితెర‌పై, పంచ్‌ల‌తో బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతున్నారు.

Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు షాకిచ్చిన గూగుల్

Sekhar Master

Sekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు తెలియని సినీ, టీవీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఎంద‌రో స్టార్ హీరోల‌కు ఆయ‌న ఫేవ‌రెట్ డ్యాన్స్ మాస్టర్. తన స్టెప్పుల‌తో వెండితెర‌పై, పంచ్‌ల‌తో బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతున్నారు. అందుకే టాలీవుడ్‌లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ శేఖర్‌ మాస్టర్‌ కు ఉంది. టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్‌ మాస్టర్‌కి గూగుల్‌ షాకిచ్చింది.

గూగుల్‌ సెర్చ్ ఇంజన్ లో శేఖర్‌ మాస్టర్‌ అని టైప్ చేస్తే…. ఆయన ఫోటోతో పాటు పుట్టిన రోజు 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తోంది. ఇది చూసి శేఖర్ అభిమానులు షాకయ్యారు. వాస్తవం ఏమిటంటే తమిళనాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జీవీ శేఖర్ ను అందరు మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు.

దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన జులై 8, 2003లో కన్ను మూశారు. ఆయన వికీపీడియాలో గూగుల్ పొరపాటున కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటోని అప్ లోడ్ చేసింది. గూగుల్ చేసిన పొరపాటుకు శేఖర్ మాస్టర్ అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా గూగుల్ డేటాను అప్ డేట్ చేయాలని కోరుతున్నారు.