Acharya: క్రిస్టమస్‌కా.. సంక్రాంతికా.. మెగాస్టార్ రాక ఎప్పుడు?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా ఒకటి. కొరటాల శివ లాంటి కమర్షియల్ దర్శకుడికి చిరంజీవి తోడైతే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో..

Acharya: క్రిస్టమస్‌కా.. సంక్రాంతికా.. మెగాస్టార్ రాక ఎప్పుడు?

Acharya

Acharya: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా ఒకటి. కొరటాల శివ లాంటి కమర్షియల్ దర్శకుడికి చిరంజీవి తోడైతే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్లే కొరటాల రామ్ చరణ్, కాజల్, పూజాహెగ్డేలను కూడా జత చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడో ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆచార్య వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan: జనసేనానిని కలిసిన నిర్మాతలు.. సయోధ్య కోసమేనా?

అయితే, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వనేలేదు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ తర్వాత దాదాపుగా అందరూ వారి వారి సినిమాల కోసం స్లాట్స్ బుక్ చేసుకుంటుంటే.. ఆచార్య టీం మాత్రం మౌనంగా వారి పని వారు చేసుకుంటున్నారు. లైవ్ లో ఉన్న బడా బడా సినిమాలన్నీ ఇప్పటికే రిలీజ్ ముహుర్తాలు పెట్టేసినా కొరటాల మాత్రం ఆచార్యని ఎప్పుడంటే చూద్దాం అన్నట్లే ఉంటున్నాడు.

Allu Aravind : ఇండస్ట్రీని దయచేసి అర్థం చేసుకోండి – అల్లు అరవింద్

సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దాదాపు సంక్రాంతి రేస్ లోనే ఫిక్స్ అయ్యిందని టాక్ ఉండగా.. కాదు కాదు అంతకన్నా ముందే క్రిస్టమస్ కే ఆచార్య దిగిపోతాడని ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలైంది. క్రిస్టమస్ కి ఇప్పటికే బన్నీ పుష్ప ఫస్ట్ పార్ట్ వస్తుందని చెప్పినా దాని మీద కూడా అనుమానాలున్నాయి. ఒకవేళ పుష్ప కనుక డిసెంబర్ లో రాకపోతే ఆచార్య తెస్తారని చెప్తున్నారు. ఒకవేళ పుష్ప డిసెంబర్ లో వస్తే మాత్రం ఆచార్య వచ్చే ఏడాదే అంటున్నారు.