క్రిస్మస్‌కు భీష్మ

నితిన్, రష్మిక జంటగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. భీష్మ (సింగిల్ ఫరెవర్).. క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 05:30 AM IST
క్రిస్మస్‌కు భీష్మ

నితిన్, రష్మిక జంటగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. భీష్మ (సింగిల్ ఫరెవర్).. క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది..

నితిన్, రష్మిక జంటగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. భీష్మ (సింగిల్ ఫరెవర్).. రష్మిక మందన్న హీరోయిన్న.. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న భీష్మ మూవీని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా చేతిలో ఫ్లవర్‌తో డిజైన్ చేసిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘చేతిలో ఫ్లవర్, ఎవరవుతారో నా లవర్, ఈ క్రిస్మస్‌కు శాంటాక్లాజ్ నాకు ఓ అమ్మాయిని గిఫ్ట్‌గా పంపాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు నితిన్. లై, చల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి వరస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌.. భీష్మతో ట్రాక్‌లోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు. 

Read Also : విజయ్ నిర్మాత తరుణ్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’..

నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : మహతి స్వరసాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఆర్ట్ : సాహి సురేష్.