Burj Khalifaపై సెలెబ్రిటీల హల్చల్.. ఈ కథేంటి?

కాదేది ప్రమోషన్స్ కి అనర్హం అనుకుంటారు మన మూవీ స్టార్స్. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ రమ్మంటే ఊరుకుంటారా.. ఎంత ఖర్చైనా సరే తగ్గేదే లే అంటున్నారు.

Burj Khalifaపై సెలెబ్రిటీల హల్చల్.. ఈ కథేంటి?

Burj Khalifa

Burj Khalifa: కాదేది ప్రమోషన్స్ కి అనర్హం అనుకుంటారు మన మూవీ స్టార్స్. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ రమ్మంటే ఊరుకుంటారా.. ఎంత ఖర్చైనా సరే తగ్గేదే లే అంటున్నారు. అయితే కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాదు.. లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని కొంతమంది అక్కడే జరుపుకుంటుంటే.. ఇంకొందరు అక్కడ చరిత్ర సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ డెస్టినేషన్ ప్లేస్ ఏంటీ అంటారా.. అదే దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా.

Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

అక్షయ్ కుమార్ సాంగేసుకున్నట్టు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఇప్పుడు ఫుల్లుగా వార్తల్లో నానుతుంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనమని కాదు కానీ.. ఆ విషయాన్ని వాడుకొని మన సెలెబ్రిటీస్ చేస్తోన్న హల్చల్ గురించి. రీసెంట్ గా బుర్జ్ ఖలీఫా ఓనర్ హోస్ట్ చేసిన అల్లు అర్హ బర్త్ డే పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఈ భవనంపై పబ్లిక్ యాసెస్ లేని ఓ ప్రైవేట్ రూమ్ లో అల్లు అర్హతో కేక్ కట్ చేయించారు ఐకాన్ స్టార్. అయితే ఈ లెవెల్ లో అలాంటి ప్లేస్ లో పుట్టినరోజు జరుపుకున్న ఫస్ట్ సెలెబ్రిటీగా రికార్డ్ కొట్టేసింది అల్లు అర్హా.

Jr NTR-Allu Arjun: వెకేషన్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్లు!

రీసెంట్ గా రిలీజైన దుల్కర్ సల్మాన్ కురుప్ కూడా బుర్జ్ ఖలీఫాపై ఓ రికార్డ్ దక్కించుకుంది. దుబాయ్ లోని ఈ అత్యంత ఎత్తైన బిల్డింగ్ పై ట్రైలర్ ఆవిష్కరించిన తొలి సౌత్ సినిమాగా నిలిచింది కురుప్. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్ ఖాన్ పుట్టినరోజున ఈ ఏడాది మళ్లీ సర్పైజ్ చేసింది బుర్జ్ ఖలిపా మేనేజ్ మెంట్. గతంలో రెండుసార్లు విషెస్ ఇలా గ్రాండ్ గా ప్రజెంట్ చేసిన బుర్జ్ ఖలీఫా ఓనర్స్.. ఈసారి కూడా బాద్షాకు ‘హ్యాపీ బర్త్‌డే’ శుభాకాంక్షలు తెలుపుతూ ఖాన్ వీడియోను ప్రదర్శించారు. దీంతో ఆర్యన్ అరెస్ట్ తో బాధపడ్డ షారుఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బుర్జ్ ఖలీఫా వీడియోలను ట్రెండ్ చేసారు.

Chiranjeevi: ఒకేసారి 5 సినిమాలు.. ఎప్పుడూ లేనంత బిజీగా మెగాస్టార్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కిచ్చా సుదీప్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బూర్జ్‌ ఖలీఫా భవనంపై సుదీప్‌కు ఈ ఏడాదే అరుదైన గౌరవం దక్కింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘విక్రాంత్‌ రోనా’ టైటిల్‌ లోగోను, టీజర్‌ను లేజర్‌ షోతో ఆ భవనంపై ప్రదర్శించారు. ప్రపంచానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ రాసుకొచ్చారు. అందరూ ఒకలా ఉంటే ఎలా అందుకే ఈ ఇయర్ బుర్జ్ ఖలీఫాపై డిఫరెంట్ గా సంచలనం సృష్టించారు హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్. తన యూట్యూబ్ సిరీస్ లో భాగంగా ఈ బిల్డింగ్ టాప్ ను అధిరోహించి రికార్డ్ సృష్టించాడు. 2,909 మెట‍్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్న ఈ బ్యాడ్‌ బ్యాయ్స్‌ హీరో.. అక్కడ ఠీవీగా ఫోజులిచ్చాడు.