కరోనా నివారణకు సాయికుమార్ ‘నాలుగో సింహం’ డైలాగ్

కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. 

10TV Telugu News

కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. 

‘కనిపించే మూడు సింహాలు నీతికి, నిజాయితీకి, ధర్మానికి మారుపేరైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’.. అని హీరో సాయికుమార్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..అయితే కరోనా నివారణ కోసం అదే డైలాగ్ ను మరోలా చెప్పారు. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. 

దేశం మనకేం చేసిందాని కంటే దేశానికి మనం ఏం చేశామన్నందే ముఖ్యం. ఈ రోజు మనం గొప్ప సేవ చేయాల్సిన అక్కర్లేదు. మన ఇళ్లళ్లో మనం కూర్చుంటే చాలు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటించాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ శుభ్రంగా ఉంటూ క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులతో మీ భార్యాపిల్లలతో మీ కుటుంబాలతో మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలన్నారు. 

మీరు బతకండి మిగతావారిని బతకనివ్వండి అని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం కలిసికట్టుగా దేశం కోసం.. ప్రపంచం కోసం పోరాడుదాం. కరోనా అనే వైరస్ ను తరిమి కొడదాం. ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుదాం. సర్వేజనా సుఖినోభవంతు అంటూ సాయికుమార్ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.