ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా లాంటిదే : డైరెక్టర్ మారుతి

ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతి 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన సినీ జీవిత విశేషాలను వివరించారు.

  • Published By: veegamteam ,Published On : January 19, 2020 / 11:55 AM IST
ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా లాంటిదే : డైరెక్టర్ మారుతి

ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతి 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన సినీ జీవిత విశేషాలను వివరించారు.

ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతి 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన సినీ జీవిత విశేషాలను వివరించారు. ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచిస్తానని చెప్పారు. పాజిటివ్ తో స్టార్ట్ చేసి, పాజిటివ్ తో ఎండ్ చేయాలనుకుంటాని తెలిపారు. నెగెటివ్ విషయాలను కూడా పాజిటివ్ గా చెప్పాలనుకుంటానని చెప్పారు. జనం సవాలక్ష బాధలతో ఉంటారు… మళ్లీ సినిమాకి పలిచి వారిని ఏడిపించకుండా మంచి విషయాన్ని నవ్వుతూ చెప్పాలనుకుంటానని వెల్లడించారు.

యాంకర్ స్వప్న : ప్రతిరోజు పండుగతో ఏదైనా లీడ్ మారినట్లు అనిపించిందా? 
డెరెక్టర్ మారుతి : ప్రతిరోజూ పండగే సినిమా నా లైఫ్ లోకి పండుగ వాతావరణం తెచ్చింది. ఒక ఫ్యామిలీ చేయాలి… అందరికీ యూనివర్సల్ గా కనెక్టు అయ్యేది అనుకున్నాను. సినిమా కథ నా ఫ్రెండ్స్ కు చెప్పినప్పుడు..నీవు ఎంటర్ టైన్ మెంట్ బాగా చేస్తావు…ఎమోషనల్ సినిమా డీల్ చేయలేదు కాదా అన్నారు. అందుకని ఎమోషన్ నా కైండ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ లోకి తీసుకొచ్చి చేశాను. ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, సినిమా బాగుందని అందరూ మెచ్చుకోవడం, నేను పండగకు ఊరెళ్తే మా ఇంటికి వచ్చి అందరూ నన్ను విష్ చేసినప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూశాను. నేను చాలా సంతోష పడ్డాను. 

యాంకర్ స్వప్న : మీరు ఈ రిస్క్ తీసుకున్నందుకు సంతోష పడుతున్నారా? ఎందుకొచ్చిన గోల అనుకుంటున్నారా?

డెరెక్టర్ మారుతి : 2005లో నేను జాబ్ మానేద్దమనుకుంటున్నానని నా వైఫ్ ని అడిగాను. ఆమె నీ ఇష్టం నీకు ఏదనిపిస్తే అది చేయి అన్నది. ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించదు. తనను బాగా చూసుకుంటే చాలు అనుకుంటుంది. మూడు నెలల్లో నేను సాధిస్తానేమోనని టైమ్ పెట్టుకుని దాని గురించి వర్క్ చేసే వాణ్ని. కానీ నాకు కావాల్సింది మూడు నెలల్లో ఎందుకివ్వాలని దేవుడు అనుకుంటాడు కదా. కాబట్టి దాని గురించి దేవుడు నన్ను గట్టిగానే కష్టపెట్టాడు. కష్టపడితేనే తెలుస్తుంది. అన్ని ఫేజ్ లు చూసుకుంటూ వచ్చాను. మా ఇంట్లో నాకు మోరల్ సపోర్టు లభించింది. నా వైఫ్ నుంచి సపోర్టు వచ్చింది. 

చిన్న యాడ్స్ చేశాను. ఇల్లు గడవటం కోసం ఏవేవి చేయాలో అవి చేసుకుంటూ టీవీల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చిరంజీవిగారి పరిచయం తర్వాత ఆయన దగ్గర యాడ్స్ చేశాను. నీకు తెలియకుండా నీలో ఒక డైరెక్టర్ ఉన్నాడని చిరంజీవి గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్ తో మనం కూడా డైరెక్షన్ చేయొచ్చనే కాన్ఫిడెంట్ నాలో వచ్చి రిస్క్ చేశాను. అక్కడి నుంచి నన్ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లి పోయింది. ఇప్పుడు జనాలు ఇది అదిరిపోతుందని, ఎక్సైజ్ మెంట్ అయిపోయి. చాలా త్వర త్వరగా ఎదిగిపోవాలనుకుంటున్నారు. దాని వల్ల త్వర త్వరగా పడిపోతున్నారు. అలాంటి వారిని చాలా మందిని చూశాను. నేను 9 సినిమాలు చేసినా.. పదో సినిమా నాకు ఫస్ట్ సినిమా లాగానే ఉంటుంది. 

చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తేనే సినిమా మినిమమ్ గ్యారంటీ, సేఫ్ జోన్ లోకి తీసుకరాగలుతాం. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బ్లస్టర్లు మనం చేతుల్లో ఉండవు. రిలీజ్ చేసిన టైమ్ తోడై దాన్ని హిట్ లెవల్ కు తీసుకెళ్తాయి కానీ..మినిమమ్ గ్యారంటీ సినిమా తీయాలంటే ఫస్ట్ సినిమా లాగా కష్టపడాలి. మంచిమాట తెచ్చుకోవడం కోసమే కష్టపడతాను. ప్రేమకథ చిత్రం సరదాగా తీసిన సినిమా. పేరు వేసుకోవడానికి కూడా భయపడి తీసిన సినిమా. 

భలే భలే మగాడివోయ్ సినిమా మంచి సినిమా, ఆవరేజ్ సినిమా అవుతుందనుకున్నాను. ఆ విధంగానే మహానుభావుడు, ప్రతిరోజూ పండగే తీశాను. ఏం తప్పు లేదు…సినిమా బాగానే ఉంది. అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుని ప్రతిరోజూ పండగే సినిమా తీశాను. కానీ ఇంతమంది స్వంతం చేసుకుంటారని ఊహించలేదు. కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని అనుకోలేదు. గాడ్స్ గ్రేస్, ఆడియన్స్ ఎక్కువమందిని కనెక్టు చేసుకుని చేశాను. 

యాంకర్ స్వప్న : మారుతి గారు మీ డైలాగులు మీరే రాస్తారా?
డెరెక్టర్ మారుతి
: నా డైలాగులు నేను రాసుకుంటున్నాను. అన్ని డైలాగులు రాసుకుంటాను. దాసరి నారాయణరావు గారితో పోల్చుకోను కానీ డైలాగ్ అనేది మాత్రం ఎవరి స్టైల్ వాళ్లదే ఉంటది. ఎందుకంటే నేను ఒక పాయింట్ గురించి రాయాలి, డిస్కస్ చేయాలంటే నేను ఇంకొకరిలాగా కాపీ కొట్టాలని కూర్చుంటే దాన్ని చేయలేను. త్రివిక్రమ్ లాగా రాయాలని ట్రై చేస్తే ఆ డైలాగ్ ఆయన నుంచి కాపీ కొట్టాడని చెప్పేస్తుంది. కొన్ని డైలాగులు, కొంతమంది పెద్దవాళ్ల మాటలు మనల్ని అంతలా ముద్రిస్తాయి. అలాగే త్రివిక్రమ్ గారి డైలాగులు అంతగా ముద్రిస్తాయి. కాపీ చేయడానికి ట్రై చేయకూడదు. 

మన స్వంతంగా మన లోపలి నుంచి రాయాలి. నేను ప్రాసలో రాయలేను. కానీ నేను చెప్పదల్చుకున్నది స్ట్రెయిట్ గా చెబుతాను. నా ఇంటెన్షన్ ఆడియన్స్ కు రీచ్ అయితే చాలనకుంటాను. దాన్ని పోయటిక్ గా చెప్పడం నాకు తెలియదు, రాదు. నేను ఒక విషయాన్ని స్ట్రెయిట్ గా చెప్పదల్చుకుంటే చెప్పేస్తాను. నాకు నవ్వించడం బాగా వచ్చు. నవ్వించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తా. ఇంకా ఎంత చేయగలను. సినిమాకి ఏమేమీ కావాలో అవన్ని పెట్టేసుకుంటాను..అని వివరించారు.