Cinema : ఈ సినిమాలు ఎప్పుడొస్తాయి??

కరోనా వల్ల చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. కొన్ని షూటింగ్స్ అవ్వక, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వక, కొన్ని థియేటర్స్ లేవని, కొన్ని డేట్లు లేక... ఇలా చాలా కారణాలతో సినిమాలు రిలీజ్

Cinema :  ఈ సినిమాలు ఎప్పుడొస్తాయి??

Movie

Cinema :  కరోనా వల్ల చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. కొన్ని షూటింగ్స్ అవ్వక, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వక, కొన్ని థియేటర్స్ లేవని, కొన్ని డేట్లు లేక… ఇలా చాలా కారణాలతో సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు సరైన సమయం కోసం చూస్తున్నారు. సెకండ్ వేవ్ తర్వాత నాలుగైదు పెద్ద సినిమాలు తప్ప చాలా మంది స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమాలు థియేటర్ లో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ కావాలి. ఇన్ని రోజులు కొన్ని చోట్ల థియేటర్స్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే అన్ని థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అందుకే చాలా పెద్ద సినిమాలు క్రిస్మస్ కి సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అప్పటికి జనాలు అంతా వచ్చి కలెక్షన్స్ వస్తాయని నమ్ముతుంది సినీ పరిశ్రమ.

Nagababu : నాగబాబుకి కౌంటర్ వేసిన ‘కోటా’.. చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరో కూడా తెలీదు..

ఇప్పటికే ‘పుష్ప’ డిసెంబర్ 17న రానుంది. వారం రోజుల్లోనే నాని ‘శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న రానుంది. రెండు వారాల గ్యాప్ తో ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న వస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సారి కూడా ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సంక్రాంతికి ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ , ‘సర్కారి వారి పాట’ సినిమాలు రిలీజ్ అవుతాయని అనౌన్స్ చేశారు. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలంటే కలెక్షన్స్ కష్టమే. మరి వీళ్లల్లో ఎవరో ఒకరు తగ్గే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరిలో ‘ఆచార్య’ వచ్చే ప్లాన్ లో ఉంది. కానీ అది కూడా అనుమానమే. ఇవన్నీ డేట్లు ఫిక్స్ చేసుకొని ఉన్నాయి. ఇవి కాక ఇంకా చాలా సినిమాలు కరెక్ట్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాయి. పోటీ లేకుండా వస్తే కలెక్షన్స్ ఎక్కువ కొట్టొచ్చు అని ఆలోచిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్.. రాధే శ్యామ్ టీజర్.. విక్రమాదిత్య ఎవరు??

బాలయ్య బాబు ‘అఖండ’ సినిమా, రవితేజ ‘ఖిలాడీ’ సినిమా, వెంకటేష్ ‘దృశ్యం2’, రానా ‘విరాట పర్వం’, నాగ చైతన్య ‘థ్యాంక్ యు’, నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలు రిలీజ్ డేట్లకోసం చూస్తున్నాయి. ఇవే కాక చాలా చిన్న సినిమాలు, యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ల కోసం చూస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఇలా వాయిదా మీద వాయిదా పడటం ఇదే మొదటి సారి కావొచ్చు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమకి చాలా నష్టం రావడంతో వరుస సినిమాలని రిలీజ్ చేసి ఆ నష్టాన్ని భర్తీ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ సమస్యలు, ఉన్న సినిమాలకి రిలీజ్ డేట్లు దొరక్క స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా పడక తప్పట్లేదు. అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.