‘బొమ్మ పడుతుంది’.. నిబంధనలు ఇవే..

  • Published By: sekhar ,Published On : November 24, 2020 / 12:25 PM IST
‘బొమ్మ పడుతుంది’.. నిబంధనలు ఇవే..

Telangana Movie Theatres: లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుండి సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు థియేటర్ల పున: ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం మంది ప్రేక్షకులతో కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.


సినిమా హాళ్లలో మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండాలని, అలానే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి షోకు ముందు థియేటర్ల పరిసరాలను శానిటైజేషన్‌ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి.

Telangana Movie Theatresతెలంగాణలో గల 200 మల్టీప్లెక్స్‌లు, 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు డిసెంబర్ 4 నుంచి రీ ఓపెన్ కానున్నాయి. థియేటర్లు మూతపడడంతో సినిమా రంగం అతలాకుతలమైంది. థియేటర్లలో పని చేసే సిబ్బంది, చిత్ర నిర్మాణాల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది ఉపాధి కోల్పోయారు.