CISF : సల్మాన్ ఖాన్‌ని అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ అధికారి, హీరో అంటూ ప్రశంసలు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సల్లూ భాయ్

CISF : సల్మాన్ ఖాన్‌ని అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ అధికారి, హీరో అంటూ ప్రశంసలు

Cisf Officer

CISF Officer : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సల్లూ భాయ్ కి అభిమానులు ఉన్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడతారు. అయితే, అలాంటి సల్మాన్ ఖాన్ ని అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఇప్పుడు హీరో అయ్యాడు. అందరూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ అధికారికి అంతా సెల్యూట్ చేస్తున్నారు. సల్మాన్ ని అడ్డుకున్న అధికారి ఎందుకు హీరో అయ్యాడు అనే వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం టైగర్-3. ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరగనుంది. ఇందుకోసం వారు పయనం అయ్యారు. ఎయిర్ పోర్టుకి వెళ్లారు. సల్మాన్ కారు దిగగానే అభిమానులు చుట్టుముట్టారు. ఒక్క ఫొటో భాయ్ అంటూ వెంటపడ్డారు. అవేమీ పట్టించుకోని సల్మాన్ ముందుకు కదిలాడు. ఎయిర్ పోర్టులోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను ఆపేశాడు. తన ఐడెంటీని కన్ ఫర్మ్ చేసుకోవాలని చెప్పాడు. అంతే, ఆ అధికారి ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

సల్మాన్ ఖాన్ పెద్ద సెలబ్రిటీ అని తెలుసు. టాప్ హీరో అనీ తెలుసు. పరిచయం అక్కర్లేని పాపులర్ ఫిగర్. అయినా ఆ అధికారి అవేమీ పట్టించుకోలేదు. తన డ్యూటీ తను చేశాడు. తనకు కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా ఒక్కటే అని ప్రూవ్ చేశాడు. కామన్ మ్యాన్ కి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అవే సల్మాన్ కి వర్తిస్తాయని చాటి చెప్పాడు. తన ఐడెంటీ కన్ ఫర్మ్ చేసుకోవాలని సల్మాన్ కి సూచించాడు. ఆ తర్వాత సల్మాన్ ని ఎయిర్ పోర్టులోని వెళ్లనిచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అధికారిని అంతా హీరో అని పొగుడుతున్నారు. ఆయన డ్యూటీ ఆయన చేశాడు, రియల్లీ గ్రేట్ అంటూ కితాబిచ్చారు. మీకు సెల్యూట్ సార్ అని అంటున్నారు. అదీ సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ కున్న పవర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)