11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో : రిలీజ్ డేట్స్ పై దిల్ రాజు క్లారిటీ

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ''సరిలేరు నీకెవ్వరు'', ''అల.. వైకుంఠపురములో'' సినిమాల విడుదల

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 01:11 PM IST
11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో : రిలీజ్ డేట్స్ పై దిల్ రాజు క్లారిటీ

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ”సరిలేరు నీకెవ్వరు”, ”అల.. వైకుంఠపురములో” సినిమాల విడుదల

సంక్రాంతి పండుగ సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ”సరిలేరు నీకెవ్వరు”, ”అల.. వైకుంఠపురములో” సినిమాల విడుదల తేదీల్లో ఎలాంటి మార్పులేదని దిల్ రాజు చెప్పారు. ముందు చెప్పినట్టుగానే.. జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ బాబు ”సరిలేరు నీకెవ్వరు” సినిమా విడుదలవుతుందన్నారు. 12న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ”అల.. వైకుంఠపురములో” సినిమా రిలీజ్ అవుతుందన్నారు. దీంతో ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. ఇక సినిమా టికెట్లు బుక్ చేసుకునే పనిలో పడ్డారు.

sari

ఈ పండక్కి నాలుగు సినిమాలు వస్తున్నాయి. అవి అల్లు అర్జున్ ”అల వైకుంఠపురములో”.. మహేష్ బాబు ”సరిలేరు నీకెవ్వరు”.. రజినీకాంత్ ”దర్బార్”.. కళ్యాణ్ రామ్ ”ఎంత మంచివాడవురా” సినిమాలు ఉన్నాయి. ఇందులో రజినీ, కళ్యాణ్ రామ్ తమ మూవీల రిలీజ్ డేట్స్ పై క్లారిటీగానే ఉన్నా.. బన్నీ, మహేష్ బాబు మాత్రం కన్ఫ్యూజన్‌లో ఉండిపోయారు. ముందు జనవరి 11న మహేష్ బాబు.. 12న బన్నీ రావాలనుకున్నారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ విడుదల తేదీలపై కన్ఫ్యూజన్ పెంచేశారు హీరోలిద్దరూ. చివరికి దిల్ రాజు స్పందించి.. కన్ ఫ్యూజన్ కి తెరదించారు.

ala

టాలీవుడ్ లో సంక్రాంతి పండక్కి యమా క్రేజ్ ఉంటుంది. ఈ పండుగ సమయంలోనే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. వారం రోజుల పాటు సెలవులు ఉండడంతో ఫిల్మ్ మేకర్లు సైతం ఆ సమయంలోనే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీ పడతారు.

darbar

రెండు సూపర్ హిట్ల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్టర్. దిల్ రాజు నిర్మాత. అనిల్ సుంకరతో పాటు మహేష్ స్వయంగా నిర్మించారు. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’.. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలు. ఇద్దరూ సూపర్ స్టార్లు కావడంతో ఆ సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

kalyanram

Also Read : మెగా హీరోల సెంటిమెంట్: సంక్రాంతికి కలిసిరాదా?.. బన్నీ బ్రేక్ చేస్తాడా?