సరిగ్గా సంవత్సరం క్రితం వీర రాఘవుడి వేట మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. విడుదలై 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది..

  • Published By: sekhar ,Published On : October 11, 2019 / 05:36 AM IST
సరిగ్గా సంవత్సరం క్రితం వీర రాఘవుడి వేట మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. విడుదలై 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. 2018 అక్టోబర్ 11న దసరా కానుకగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తారక్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అరవింద సమేత కటౌట్స్, ఫ్లెక్సీలు, థియేటర్ రెస్పాన్స్, రికార్డ్స్, సక్సెస్‌మీట్.. ఇలా.. సంవత్సరం ముందు అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఆ మెమరీస్ అన్నిటినీ షేర్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథా, కథనాలు, మనసుని హత్తుకునే మాటలు, ఎన్టీఆర్ అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ సినిమాకు హైలెట్ అయ్యాయి.

Read Also : ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో ‘తలైవా’ 168

బసిరెడ్డిగా జగపతిబాబు ఈ సినిమాకు పిల్లర్‌లా నిలిచారు. థమన్ పాటలు, నేపథ్య సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అరవింద సమేత 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ తెలుపుతూ.. ట్వీట్ చేసింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ..