CM Jagan: మనసానమః షార్ట్‌ఫిల్మ్‌కి ఫిదా అయిన సీఎం జగన్.. డైరెక్టర్‌కి అభినందనలు

మనసానమః.. ఈ లఘుచిత్రానికి డైరెక్టర్ దీపక్ రెడ్డి ఏమంటూ ఈ పేరు పెట్టాడో గాని ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటుంది. ఈ షార్ట్ ఫిలిం చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా డైరెక్టర్ దీపక్ రెడ్డిని అభినందిచారు. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో తమిళ్ లో అనువదించి విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...

CM Jagan: మనసానమః షార్ట్‌ఫిల్మ్‌కి ఫిదా అయిన సీఎం జగన్.. డైరెక్టర్‌కి అభినందనలు

CM Jagan Congratulate Manasanamaha Shortfilm Director

CM Jagan: మనసానమః.. ఈ లఘుచిత్రానికి డైరెక్టర్ దీపక్ రెడ్డి ఏమంటూ ఈ పేరు పెట్టాడో గాని ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటుంది. అంతలా ఈ చిత్రంలో ఏముంది అనుకుంటున్నారా. “సూర్య అనే యువకుడు తన మూడు ప్రేమ కథల్ని వివరిస్తుంటాడు, కానీ అది రివర్స్ పద్ధతిలో నేరేట్ చేస్తుంటాడు. ప్రతి ప్రేమకథ ముగింపు నుంచి మొదటికి వెళ్తుంటుంది”.

Manasanamaha: గిన్నిస్ అవార్డ్ అందుకున్న తెలుగు షార్ట్ ఫిలిం డైరెక్టర్‌కి.. వీసా ఇబ్బందులు

డైరెక్టర్ దీపక్ రివర్స్ పద్ధతిలో నేరేట్ చేసినా, ఎక్కడా తడబడకుండా ప్రేక్షకుడికి అర్థమైయేలా చాలా అందంగా చూపించడంతో ప్రేక్షకులు ఈ లఘుచిత్రాన్ని గొప్ప విజయంగా మలిచారు. 2020 జనవరిలో విడుదలై ఏకంగా ఇప్పటివరకు 513 అవార్డులు అందుకుని ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్న లఘుచిత్రంగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్ లోకి ఎక్కింది. గత ఏడాది ఆస్కార్ అవార్డు స్క్రీనింగ్ కూడా వెళ్ళింది.

ఈ షార్ట్ ఫిలిం చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా డైరెక్టర్ దీపక్ రెడ్డిని అభినందిచారు. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో తమిళ్ లో అనువదించి విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ లఘుచిత్రానికి ఫిదా అవ్వడంతో డైరెక్టర్ దీపక్ రెడ్డిని పిలిచి అభినదించారు. ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్నందుకు ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలంటూ ప్రోత్సహించారు.