Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

ఇటీవల కరోనా ఉదృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండగా.. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా..

Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

Chiranjeevi Cm Kcr

Chiranjeevi-CM KCR: ఇటీవల కరోనా ఉదృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండగా.. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన మెగాస్టార్.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిరు కరోనా వార్తతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చిరంజీవిని పరామర్శించారు. చిరుకు ఫోన్ చేసిన సీఎం ఆరోగ్య వివరాలను కనుక్కున్నారు.

RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి

చిరంజీవి త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. చిరంజీవి కరోనా బారిన పడడం ఇది రెండవసారి కాగా.. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న నాలుగైదు సినిమాల షూటింగ్ వాయిదా పడింది.