Chalo Premiddam: అమ్మాయేంట్రా ఇంత టిపికల్‌గా ఉంది.. కలర్ ఫుల్‌గా చలో ప్రేమిద్దాం ట్రైలర్!

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ఛ‌లో ప్రేమిద్దాం.

Chalo Premiddam: అమ్మాయేంట్రా ఇంత టిపికల్‌గా ఉంది.. కలర్ ఫుల్‌గా చలో ప్రేమిద్దాం ట్రైలర్!

Chalo Premiddam

Chalo Premiddam: హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ఛ‌లో ప్రేమిద్దాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసిన యూనిట్ ట్రైలర్ లాంచ్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ట్రైల‌ర్ చూస్తుంటే క‌ల‌ర్ ఫుల్ గా ఉందని.. యూత్ ఫుల్ కథాంశంతో వస్తున్న చలో ప్రేమిద్దాం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ..`మా బేన‌ర్ లో వ‌స్తోన్న మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. పాట‌ల‌కు, ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ నెల 19న రానున్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు పెద్ద స‌క్సెస్ చేయాలని కోరారు. ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె మాట్లాడుతూ.. ల‌వ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాని తెరకెక్కించామని.. ఖచ్చితంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందని.. ద‌ర్శ‌కుడుగా నా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు. క్యూట్ ల‌వ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్అంశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని హీరో, హీరోయిన్లు వెల్లడించారు.

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

ఇక, ట్రైలర్ విషయానికి వస్తే.. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ హీరోయిన్ టీజ్ చేసే ఫన్నీ ఎపిసోడ్ తో మొదలు పెట్టిన టీజర్ చూస్తే ఇది లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని అర్ధమవుతుంది. ఇక ఇందులో గతంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా తరహాలోనే హీరోను ఇష్టపడుతూనే ప్రేమలేని హీరోయిన్.. హీరోయిన్ ప్రేమించలేదని తెలిసినా ఇష్టపడే హీరో యాంగిల్ లో ప్రయత్నించినట్లు కనిపించింది. గతంలో నాగార్జున ‘మాస్’ సినిమాలో ఛార్మి కిస్ పిష్ కిప్ చుప్ అనే క్యూట్ ఎక్స్ ప్రెషన్ లాగానే ఇందులో కూడా హీరోయిన్ కి ఒక క్యూట్ ఎక్స్ ప్రెషన్ మేనరిజంగా పెట్టారు.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

ఇక.. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీతో పాటు ఓ మోస్తరు యాక్షన్ కూడా ఈ సినిమాలో టచ్ చేసినట్లుగా ముందే ట్రైలర్ లో చూపించేశారు. తొలి సినిమానే అయినా హీరో, హీరోయిన్ల చార్మింగ్.. కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుండగా.. శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ భారీ తారాగణాన్ని కూడా ఈ సినిమాలో నటించడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.