Ali : ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి నార్త్ వాళ్ళని తెచ్చుకున్నాం.. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు..

ఇటీవల సౌత్, నార్త్ అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆలీ కూడా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ఆలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక అరడజను తెలుగు..............

Ali : ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి నార్త్ వాళ్ళని తెచ్చుకున్నాం.. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు..

Ali

Ali :  బాల నటుడిగా మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, హీరోగా నటించి, టీవీ షోలతో కూడా మెప్పించి ఇంకా ప్రేక్షకులని నవ్విస్తున్న కమెడియన్ ఆలీ త్వరలో F3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఆలీ F3 లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఫన్నీ మల్టీస్టారర్ మే 27న రిలీజ్ అవ్వనుంది. దీంతో ఈ సినిమాలో నటించిన వారంతా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా కమెడియన్ ఆలీ F3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 

VishwakSen : హిట్ కొట్టాడు.. కోటి రూపాయల కారు కొన్నాడు..

 

ఇటీవల సౌత్, నార్త్ అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆలీ కూడా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ఆలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక అరడజను తెలుగు సినిమాలు, ఒక తమిళ వెబ్ సిరీస్. కన్నడలో ఒక సినిమా, నేపాలీలో కూడా ఒక సినిమా చేస్తున్నాను. ఒకప్పుడు వేరే భాషల్లోని సినిమాల్లో మనం అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ అంతగా మారిపోయింది. ఒకప్పుడు నార్త్‌ వాళ్లను మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్‌ నేర్పించి, తెలుగు డబ్బింగ్‌ దగ్గరుండి చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు సౌత్‌ వాళ్ల సత్తా ఏంటో బాలీవుడ్ వాళ్లకి తెలిసింది. అక్కడి సినిమాల కోసం తెలుగు నటుల్ని పిలుస్తున్నారు. వాళ్ళే మన సినిమాల్లో యాక్ట్ చేస్తామని అడుగుతున్నారు” అంటూ తెలుగు సినిమాల రేంజ్ పెరిగిందని తెలిపారు.