ఇంట్లోనే ఉండి నమాజ్ చేస్తున్నా- డబ్బు సంపాదించే సమయం కాదు..

కరోనా మహమ్మారిపై స్పందించిన ప్రముఖ నటుడు అలీ..

  • Published By: sekhar ,Published On : March 25, 2020 / 05:27 AM IST
ఇంట్లోనే ఉండి నమాజ్ చేస్తున్నా- డబ్బు సంపాదించే సమయం కాదు..

కరోనా మహమ్మారిపై స్పందించిన ప్రముఖ నటుడు అలీ..

కరోనా కల్లోలం రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. గతకొద్ది రోజులుగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశాలిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ హాస్యనటుడు అలీ కరోనా గురించి తన స్పందన తెలియచేశారు. 

‘‘కరోనా వైరస్‌ పైకి వెళ్లిపోవాలని కోరుతూ గత పదిరోజులుగా ఇంట్లోనే ఉండి నమాజ్‌ చేస్తున్నా. చాలా మంది తిండి లేక, డబ్బుల్లేక బాధపడుతుంటారు.. కానీ తప్పదు. ఈ వ్యాధి అలాంటిది. ఇటలీలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారి మృతదేహాలను తీయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలకు, పోలీసులకు సహకరించాలి’’ అన్నారు అలీ. కరోనా కట్టడి సహాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లక్ష రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి లక్ష రూపాయలు సాయం ప్రకటించారు.

Read Also : నాని ఏం కూర వండాడో తెలుసా?.. అమ్మతో కలిసి పచ్చడి పెట్టిన నాగశౌర్య..

‘‘భారతదేశంలో చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు.. ఈ సమయంలో వారు కూడా సాయం చేస్తే చాలా మంచిది.. ఈ వైరస్‌పై ఎవరూ కామెంట్స్‌ చేయొద్దు.. కామెడీ చేయొద్దు. ఈ సమయంలో చాలా మంది రేట్లు పెంచి డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు.. ఇది సంపాదించే సమయం కాదు.. మానవత్వం చూపాల్సిన సమయమిది. ఎంత రేటు ఉంటే అంతకే అమ్మండి’’ అన్నారు అలీ.