Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

హాలీవుడ్ లో రిలీజ్ జాతర జరగబోతోంది. జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై ఇచ్చిన కలెక్షన్ల కాన్ఫిడెన్స్ తో వరస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి సినిమాలు. ఎవర్ ఇంట్రస్టింగ్..

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

Hollywood

Hollywood: హాలీవుడ్ లో రిలీజ్ జాతర జరగబోతోంది. జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై ఇచ్చిన కలెక్షన్ల కాన్ఫిడెన్స్ తో వరుస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి సినిమాలు. ఎవర్ ఇంట్రస్టింగ్ ఎటర్నల్స్ దగ్గరనుంచి రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 వరకూ రిలీజ్ డేట్స్ లాక్ చేసేసుకున్నాయి. కరోనా మహమ్మారి బీభత్సం తర్వాత మన టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ సినిమాలకి మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.

Akhanda: యూనిట్ పార్టీ.. ప్రగ్యాతో బాలయ్య చిల్ అవుట్

హాలీవుడ్ లో ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక సినిమాలకు మంచిరోజు లొచ్చాయంటూ వరుసపెట్టి హాలీవుడ్ సినిమాలన్నీ రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 22న ది లాస్ట్ డ్యూయల్ మూవీ, 29న గోనే రాంగ్, నవంబర్ 5న ద మోస్ట్ ఎగ్జైటెడ్ ఎటర్నల్స్ రిలీజ్ అవుతున్నాయి. యాక్షన్ ఎలివేటెడ్ వెస్ట్ సైడ్ స్టోరీ డిసెంబర్ 10న రిలీజ్ అవుతుంటే .. ది కింగ్స్ మ్యాన్ డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశాయి.

Dasara Films: పండగ పెద్దదే.. కానీ సందడి లేని స్టార్ హీరోలు!

ఇక్కడితో అయిపోలేదు.. రెండేళ్ల వెయిటింగ్ కదా.. నెక్ట్స్ ఇయర్ కూడా దాదాపు 10 సినిమాల్ని రిలీజ్ చేస్తోంది హాలీవుడ్. డెత్ ఆన్ ద నెయిన్ ఫిబ్రవరి 11 రిలీజ్ అవుతుంటే.. టర్నింగ్ రెడ్ మార్చ్ 11న ధియేటర్లోకొస్తోంది. హాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ మూవీ జులై 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

ఇంట్రస్టింగ్ మూవీ ద బ్లేడ్ అక్టోబర్ 7 రిలీజ్ అవుతుంటే.. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ద మార్వెల్స్ నవంబర్ 11న ఆడియన్స్ ముందుకురాబోతోంది. అమేజింగ్ విజువల్స్ తో , అంతకుమించిన గ్రాఫిక్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ 2ని చూడాలంటే మాత్రం డిసెంబర్ 16 వరకూ ఆగాల్సిందే అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.