RRR: థియేటర్ సిబ్బంది-ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. ఫ్యాన్స్‌పై దాడి?

కరీంనగర్ లోని మమతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై థియేటర్ సిబ్బంది దాడి చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను..

RRR: థియేటర్ సిబ్బంది-ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. ఫ్యాన్స్‌పై దాడి?

Rrr

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు స్క్రీన్స్‌లో విడుదలైంది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

RRR : తెలుగు సినిమాపై మరోసారి విషం కక్కిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఖాన్

ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో అభిమానులు గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్స్ వద్ద పడిగాపులు కాయడంతో పాటు తమ అభిమాన హీరో సినిమాను చూడ్డానికి కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూశారు. అయితే కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇరు హీరోల అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోగా.. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ థియేటర్ యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవ ఉద్రిక్తతకి దారి తీసింది.

RRR: యూనానిమస్ రెస్పాన్స్.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్

కరీంనగర్ లోని మమతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై థియేటర్ సిబ్బంది దాడి చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి యాజమాన్యం టికెట్స్ ఇవ్వడం లేదని యాజమాన్యంపై గొడవకి దిగడంతో మొదలైన రచ్చ చివరికి పరస్పర దాడుల వరకు వెళ్ళింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో మాట్లాడడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.