Gandhi : Why I Killed Gandhi .. సినిమాని బ్యాన్ చేయాలంటూ..

'Why I Killed Gandhi' సినిమాను బ్యాన్ చేయాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. థియేటర్లలోనూ, ఓటీటీ ఫార్మాట్‌లోనూ ఆ సినిమా రిలీజ్ కాకుండా........

Gandhi :  Why I Killed Gandhi .. సినిమాని బ్యాన్ చేయాలంటూ..

Gandhi

Why I Killed Gandhi :   గాంధీ చరిత్రపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. తాజాగా గాంధీ హత్యపై, నాథురాం గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు అనే కథాంశంతో ‘Why I Killed Gandhi’ అనే సినిమా తెరకెక్కింది. గాంధీ వల్లే పాకిస్థాన్ భారత్ మత ప్రాతిపదికన విడిపోయాయని, దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారని ఇప్పటికి అపవాదు ఉంది. అందుకే గాడ్సే గాంధీని చంపాడని చరిత్రలో చెపుతారు. ఇదే కథాంశంతో ఇప్పుడు సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో మాజీ శివ‌సేన నేత‌, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోలే నాథూరామ్ గాడ్సే పాత్ర‌ను పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సినిమాని జనవరి 30 గాంధీ వర్థంతి రోజున లైమ్ లైట్ అనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు కోరుతున్నారు.

Pawan Kalyan : 2024 ఎన్నికలకి పక్కా ప్లాన్.. ఒక్కో సినిమాకి 60 రోజులు మాత్రమే డేట్స్..

‘Why I Killed Gandhi’ సినిమాను బ్యాన్ చేయాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. థియేటర్లలోనూ, ఓటీటీ ఫార్మాట్‌లోనూ ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డ‌కోవాల‌ని కోరింది. ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోనివ్వ‌మ‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలాగే ఈ సినిమాని బ్యాన్ చేయాల‌ని ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ డిమాండ్ చేస్తూ ప్ర‌ధాని మోదీకి లేఖ రాసింది.