రివ్యూ : ఇదంజగత్

ఇదంజగత్..ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సుమంత్‌కి ఎలాంటి ఫలితం ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 12:08 PM IST
రివ్యూ : ఇదంజగత్

ఇదంజగత్..ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సుమంత్‌కి ఎలాంటి ఫలితం ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం.

రీసెంట్‌గా సుబ్రహ్మణ్యపురం సినిమాతో 25 సినిమాలను పూర్తి చేసుకున్న సుమంత్, ప్రస్తుతం వైవిద్యమైన కథలతో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. అలా.. సుమంత్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ ద్రిల్లర్, ఇదంజగత్.. టీజర్, ట్రైలర్లతో ఆ సినిమా మూడ్‌ని కన్వే చేసి ఏదో ఎంగేజ్ చేసే విషయం సినిమాలో ఉందని ప్రేక్షకులకు హింట్స్ ఇవ్వడంతో ఇదంజగత్ టీమ్ సక్సెస్ అయ్యారు. సో.. అలా అంచనాలను క్రియేట్ చేసుకున్న ఇదంజగత్..ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సుమంత్‌కి ఎలాంటి ఫలితం ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, మోసాలు చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటాడు నిషిత్. ఆ క్రమంలో నైట్ రిపోర్టర్ అవతారం ఎత్తుతాడు. రాత్రుళ్లు జరిగే సంఘటనలను షూట్ చేసి, ఆ ఫుటేజ్‌ని ఛానళ్లకు అమ్ముకుని డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి వాళ్ల నాన్న హత్యకు గురవుతాడు. ఆ హత్యను సుమంత్.. రికార్డ్ చేస్తాడు. దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. మరి సుమంత్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా..? అసలు ఆ హత్య ఎవరు చేశారు..? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానికొస్తే.. సుమంత్… నిషిత్ పాత్రలో ఇమిడిపోయాడు. ఆ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు. నైట్ రిపోర్టర్‌గా అతని హావభావాలు..చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. ఇక హీరోయిన్ అంజు కురియన్.. తనపాత్ర పరిధిమేర నటించింది. గ్లామర్ పరంగా మెప్పించలేకపోయినా.. పాత్ర పరంగా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అక్కడక్కడా.. కామెడీ‌ని పండించేందుకు ట్రై చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన శివాజీ రాజా, తన పాత్రకు న్యాయం చేశాడు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..దర్శకుడు అనిల్ శ్రీకంఠం క్రైమ్ జానర్‌కు డిఫరెంట్ పాయింట్‌తో కథను రాసుకోవడం.. సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే.. ఆ కథను అంతే ఇంట్రెస్టింగ్‌గా తెరమీదకు తీసుకురావడంలో చాలా చోట్ల తడబడ్డాడనే చెప్పాలి.ఆసక్తి కరమైన థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు అనిల్ శ్రీకంఠం. ఇక చరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఏమాత్రం సినిమా స్తాయికి తగ్గట్టుగా లేవు.

ప్లస్
సుమంత్
స్టోరీ లైన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
………..

మైనస్
స్లో నెరేషన్, స్క్రీన్ ప్లే
లవ్ ట్రాక్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్