రాజశేఖర్ కల్కి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  • Edited By: sekhar , January 1, 2019 / 11:45 AM IST
రాజశేఖర్ కల్కి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

డా.రాజశేఖర్, గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు. కాస్త గ్యాప్ తీసుకుని, అ! సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి మూవీ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా, కల్కిలో రాజశేఖర్ ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
జీన్స్ ప్యాంట్, షర్ట్, బ్లేజర్ వేసుకుని, గాగుల్స్ పెట్టుకుని రాజశేఖర్ స్టైల్‌గా జీప్‌లో కూర్చుని ఉన్నాడు ఈ లుక్‌లో.. లుక్ వైజ్ గ్లామర్‌గానే చూపించారు. మోషన్ పోస్టర్ థీమ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రాజశేఖర్ కూతుళ్ళు శివాని, శివాత్మిక సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై, సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా, శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

కల్కి, 1983 తెలంగాణా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుందని తెలుస్తుంది. రాజశేఖర్ ఈ సినిమాలో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. 

వాచ్ కల్కి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్…