Srikanth : శ్రీకాంత్ సినిమా చూడండి… అయిదు ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి..

 తెలుగు చిత్రసీమ‌లో చిన్న సినిమాల సంద‌డి కొన‌సాగుతోంది. ఓవైపు పెద్ద చిత్రాలు వాళ్ళ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుంటే మ‌రోవైపు చిన్న సినిమాలు కూడా తమకు తోచిన రీతిలో కొత్తగా ప్రమోషన్స్

Srikanth : శ్రీకాంత్ సినిమా చూడండి… అయిదు ఎన్ ఫీల్డ్ బైక్స్ గెలుచుకోండి..

Ide Ma Katha (1)

Srikanth :  తెలుగు చిత్రసీమ‌లో చిన్న సినిమాల సంద‌డి కొన‌సాగుతోంది. ఓవైపు పెద్ద చిత్రాలు వాళ్ళ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుంటే మ‌రోవైపు చిన్న సినిమాలు కూడా తమకు తోచిన రీతిలో కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. తాజాగా మొన్న శ‌నివారం ‘ఇదే మా క‌థ’ అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. శ్రీకాంత్‌, సుమంత్ అశ్విన్‌, భూమిక‌, తాన్య హోప్ లు ప్రధాన పాత్రలుగా బైక్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ చిన్న సినిమాకి విడుదలకు ముందు కూడా ప్రమోషన్స్ బాగానే చేశారు. సినిమా విడుదల అయి మంచి టాక్ ని తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి ఇంకా హైప్ తీసుకురావడానికి చిత్ర బృందం కొత్త కాంటెస్ట్ ని పెట్టింది.

BiggBoss : తమిళ్ బిగ్ బాస్ లో తెలుగమ్మాయి

సినిమాని చూసి ఈ సినిమా టికెట్ ని ఇదే మా కథ అనే హ్యాష్ ట్యాగ్ తో (#idemaakatha) సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపారు. ఇలా పోస్ట్ చేసిన వాళ్ళల్లో లక్కీ డ్రా తీసి ఐదుగురికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ని బహుమతిగా ఇవ్వనున్నారని తెలిపారు. ఈ కాంటెస్ట్ ని బాగా ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాంటెస్ట్ కోసం అయినా యువత సినిమాకి రావొచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు చిత్ర నిర్మాతలు. ఈ కాంటెస్ట్ కనుక సక్సెస్ అయితే సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.