Bigg Boss 5: చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?!

బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ లో తొమ్మిది వారాలు పూర్తయి పదవ వారంలో అడుగుపెట్టగా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కెప్టెన్ నలుగురిని జైల్లో పెట్టడం..

Bigg Boss 5: చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?!

Bigg Boss 5 (1)

Bigg Boss 5: బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ లో తొమ్మిది వారాలు పూర్తయి పదవ వారంలో అడుగుపెట్టగా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కెప్టెన్ నలుగురిని జైల్లో పెట్టడంలో బయట ఉన్న వాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళని కాపాడుకొనే అవకాశం ఇవ్వడం కాన్సెప్ట్ తో సాగిన నామినేషన్స్ లో ఎవరి ప్లాన్స్ వాళ్ళు అమలు చేయగా చివరికి సిరి మాత్రం తాను తవ్వుకున్న గోతిలో తానే బొక్కబోర్లా పడింది.

Bigg Boss 5: వైవిధ్యంగా సాగిన నామినేషన్స్.. ఈ వారం లిస్ట్‌లో ఐదుగురు!

ఆనీ మాస్టర్.. మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ ఈ నలుగురిని నామినేట్ చేయగా ముందు పింకీ సంకెళ్ల‌ను చేజిక్కించుకుని మాన‌స్‌ని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. తర్వాత మాన‌స్‌.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా సిరి సంకెళ్ల‌ను అందుకుని జెస్సీని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. జెస్సీ.. మాన‌స్‌ని జైలుకి పంపగా.. సంకెళ్లు ద‌క్కించుకున్న జెస్సీ ష‌ణ్ముఖ్‌ని బ‌య‌ట‌కు తెచ్చాడు. ష‌ణ్ముఖ్‌.. పింకీ, సిరిల‌ను నామినేట్ చేసి పింకీని జైలుకి పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Poonam Kaur: విడాకులపై పూనమ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించబ్బా?

మొత్తం మీద ఈ వారం కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, వీజే సన్నీ, మానస్ లు ఎలిమినేషన్ లో ఉండగా సిరి మాత్రం గేమ్ స్ట్రాటజీ అంటూ తాను తవ్విన గోతిలో చివరికి తానే పడిన సామెతని నిజం చేసుకుంది. ఇక సన్నీ పింకీను ఉద్దేశించి చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదని.. అవకాశం ఉన్నప్పుడు సేవ్ చేయకుండా ఇప్పుడు పూజలు చేస్తా ఇంకేదేదో చేస్తా అని ఉపయోగం ఏముందని క్లాస్ పీకాడు. ఇక యధావిధిగా పింకీ మానస్ చుట్టూ తిరుగుతూ ఇంకేమన్నా కావాలా అంటుంటే.. పాపం మానస్ మాత్రం నాకేం కావాలో నేను చూసుకుంటాలే అని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు.