బాలయ్య కోసం ‘ఆచార్య’ కథ రాసుకున్నా.. నిర్మాతలు రికార్డ్ చేసి కాపీ కొట్టారు..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 03:37 PM IST
బాలయ్య కోసం ‘ఆచార్య’ కథ రాసుకున్నా.. నిర్మాతలు రికార్డ్ చేసి కాపీ కొట్టారు..

Controversy On Acharya Movie Story: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కథపై కాపీ ఆరోపణలు కొనసాగుతున్నాయి. ‘ఆచార్య’ కథ తనదేనంటూ మరో రచయిత ముందుకొచ్చారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత, దర్శకుడు ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు.



‘ఆచార్య’ టైటిల్ తర్వాత వచ్చే సన్నివేశం తాను రాసుకున్న కథలోని సన్నివేశంలానే ఉందని, ఈ సన్నివేశానికి సంబంధించిన కథను ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. తర్వాత తాను ‘ఆచార్య’ పై ఆరోపణలు చేయలేదని అనిల్ క్లారిటీ ఇవ్వడంతో ఆ విషయం అక్కడితో మర్చిపోయారు. కట్ చేస్తే, తాజాగా రాజేష్ మండూరి అనే రచయిత ‘ఆచార్య’ కథ తనదేనంటూ మీడియా ముందుకు వచ్చాడు.
https://10tv.in/woman-rescued-after-26-hours-from-collapsed-maharashtra-building/
తాను బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ‘ఆచార్య’ కథ రాసుకున్నానని, మైత్రీ మూవీ మేకర్స్ వారికి కథ చెబితే రికార్డ్ చేసుకున్నారని.. ఎమ్మెల్యే రికమండేషన్‌తో వెళ్లా కదా ఏం కాదులే అని ధైర్యంగా ఉన్నానని, కథ విన్న తర్వాత కొత్త డైరెక్టర్‌వి ఇంత హెవీ మెసేజ్ సబ్జెక్ట్ డీల్ చేయలేవని మైత్రీ నిర్మాతలు చెప్పారని.. ఈ కథ పూర్తిగా నాదే.. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రాజేష్. ఈ వివాదంపై కొరటాల శివ కానీ, మైత్రీ మూవీస్ లేదా రామ్ చరణ్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.