Tollywood Star’s controversy: సక్సెస్ తోడు వివాదాలు.. హాట్ టాపిక్ అవుతున్న స్టార్స్!

సినిమా స్టార్లు ఈ మధ్య సక్సెస్ తోనేకాదు కాంట్రవర్సీలతో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో నిలుస్తున్నారు. ఈమధ్య సినిమా..

Tollywood Star’s controversy: సక్సెస్ తోడు వివాదాలు.. హాట్ టాపిక్ అవుతున్న స్టార్స్!

Tollywood Star's Controversy

Tollywood Star’s controversy: సినిమా స్టార్లు ఈ మధ్య సక్సెస్ తోనేకాదు కాంట్రవర్సీలతో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో నిలుస్తున్నారు. ఈమధ్య సినిమా వాళ్ల మీద కాంట్రవర్సీలతో పాటు ట్రోలింగ్ కూడా బాగా ఎక్కువైంది. సెలబ్రిటీలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తో కాకుండా ట్రోలింగ్ వల్లనో, కాంట్రవర్సీల వల్లనో హైలెట్ అవుతున్నారు.

Sophie Choudry: మాల్దీవులకే మెంటలెక్కిస్తున్న సోఫీ చౌదరి!

లేటెస్ట్ గా సమంత ఆ కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప మూవీలో సమంత చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి ఎంత నచ్చి హిట్ అయినా.. అదేరేంజ్ లో కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోయింది. మగవాళ్లను కించపరిచేలా ఉన్న పాటని సినిమా నుంచి తీసెయ్యాలని ఆల్రెడీ పురుషుల సంఘం కేస్ ఫైల్ చేసింది. లేటెస్ట్ గా తమిళ్ లో కూడా ఈ పాట మీద వ్యతిరేకత వస్తోంది. దాంతో పాటతెచ్చిన ప్రాబ్లమ్ తో సమంత కూడా కాంట్రవర్సీని ఫేస్ చేస్తోంది.

Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

మరో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. పాన్ ఇండియా వైడ్ గారిలీజ్ అయిన పుష్ప మూవీకి సంబందించి డబ్బింగ్ విషయంలో రష్మికను ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. బేసిక్ గా కన్నడ హీరోయిన్ అయిన రష్మిక.. పుష్ప కన్నడ వర్షన్ కి ఓన్ డబ్బింగ్ చెప్పకపోవడంతో.. ఫుల్ ఫైర్ అవుతున్నారు కన్నడ ఫాన్స్. సెకండ్ పార్ట్ కి తప్పకుండా డబ్బింగ్ చెబుతానని క్లారిటీ ఇచ్చినా కూడా అస్సలు తగ్గడం లేదు ఫాన్స్.

Pushpa: రెండో రోజు అదే వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని ఐకాన్ జోరు!

ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండే విజయ్ దేవరకొండ మరోసారి కాంట్రవర్సీతో హైలెట్ అయ్యారు. మొన్నీమధ్య వరకూ పుష్ప సినిమాని పెద్దగా పట్టించుకోకుండా ట్రిపుల్ఆర్ కి మాత్రం సపోర్ట్ చేసినందుకు ట్రోల్ చేసిన నెటిజన్స్..ఇప్పుడు లైగర్ లేట్ అవుతున్నందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన లైగర్ మూవీ నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ 25కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఇన్ని నెలలు టైమ్ ఎందుకు..? ఇంకా 8 నెలలు వెయిట్ చెయ్యాలా, లేట్ కమ్మర్ లైగర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!

పెద్దగా కాంట్రవర్సీల జోలికెళ్లని వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గని సినిమా కాంట్రవర్సీ లో ఇరుక్కున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో.. అల్లు బాబి ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న గని సినిమా స్టోరీ తనదని, అల్లు బాబీకి అప్పుడెప్పుడో ఇదే స్టోరీ చెబితే సినిమా చేద్దామని చెప్పారని.. ఇప్పుడు అదే సినిమాని గనిగా చేసేశారంటూ కాంట్రవర్సీకి దిగాడు ఓ వ్యక్తి. దాంతో సడెన్ గని కాంట్రవర్సీ తెరమీదకొచ్చింది. అయితే ఈడిసెంబర్ క్రిస్ మస్ కానుకగా రిలీజ్అవ్వాల్సిన గని షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది.