Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్

లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ గాడిన పడుతున్న టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ పట్టుకుంది. వరుస సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కళకళలాడుతున్న వేళ... కరోనా సెకండ్ వేవ్ కలకలం...సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్

Movies in April

Corona tension for Tollywood : లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ గాడిన పడుతున్న టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ పట్టుకుంది. వరుస సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కళకళలాడుతున్న వేళ… కరోనా సెకండ్ వేవ్ కలకలం…సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అన్‌లాక్‌తో మెల్లిమెల్లిగా అన్ని తెరుచుకున్నా…సినిమా షూటింగ్‌లు, థియేటర్లు ఓపెన్ అవడంతో ఆలస్యం అయింది. గత ఏడాది డిసెంబర్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యాయి. తర్వాత వందశాతం అనుమతి ఇచ్చారు. అయితే ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. సంక్రాంతి సీజన్‌తో …పెద్ద సినిమాలు రావడంతో థియేటర్స్ కలకళలాడాయి. దీంతో సినిమాల జోరు కనిపించింది.

షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ ట్రాక్ మీద పడ్డట్టే అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలలో విజృంభిస్తున్న కరోనా..దక్షిణాది రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో వణుకు మొదలైంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీని సెకండ్‌ వేవ్‌ భయం పట్టుకుంది. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీతో కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే ఉండే…విధంగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించనుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నెల 26న విడుదల కావాల్సిన దగ్గుబాటి రానా నటించిన అరణ్య హిందీ వెర్షన్ హాథీ మేర సాథి రిలీజ్ వాయిదా వేశారు. అదే రోజు నితిన్ రంగ్ దే సినిమా రిలీజ్ కానుంది. ఈ నెల 27న తెల్లవారితే గురువారం విడుదల కానుంది. ఏప్రిల్ 1న యువరత్న సినిమా, ఏప్రిల్ 2న కార్తీ సుల్తాన్ సినిమా, నాగార్జున వైల్డ్ డాగ్, గోపీచంద్ సిటిమార్ సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయ్. ఏప్రిల్9న పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌కు కూడా థియేటర్స్‌కు రానుంది. ఏప్రిల్ 16న లవ్ స్టోరీ, 23న నాని టక్ జగదీష్, 30న రానా విరాట పర్వం, మే 1న పాగల్ సినిమా, మే 13న ఆచార్య, మే14న వెంకటేష్ నారప్పా, మే 28 రవితేజ ఖిలాడి సినిమా విడుదల కానున్నాయి.

గత సమ్మర్‌ మిస్ కావడంతో ఈసారైనా బాక్స్‌ ఆఫీస్‌ను షెక్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్‌ టెన్షన్ పెడుతోంది. దీంతో సినిమా మేకింగ్ స్పీడ్‌గా కానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడితే ఇప్పటికే రిలీజ్ డేట్‌లు ప్రకటించిన సినిమాలు మళ్ళీ తేదీలు మార్చాల్సి ఉంటుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. ఇవన్నీ తలచుకొని నిర్మాతలు హడలిపోతున్నారు.

కోవిడ్ కేసుల పెరుగుదలకు భారీ సంఖ్యలో జనంతో జరుగుతున్న కార్యక్రమాలే కారణం అని ఎయిమ్స్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సారి సమ్మర్‌ను క్యాష్ చేసుకుందామనుకున్న నిర్మాతలకు ఎదురుదెబ్బలు తప్పేలా కనిపించడం లేదు.