Most Awaited Movies: క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ల్యాబులకే.. ఎంత పని చేశావే మాయదారి కరోనా!

కొవిడ్ లాంగ్ ఎఫెక్ట్ తో సతమతమవుతున్నాయి కొన్ని సినిమాలు. కరోనా ఆంక్షలతో సినిమా షూటింగ్స్ నే చాలా కష్టం మీద పూర్తి చేసిన మేకర్స్.. సినిమా రిలీజ్ చేయాలంటే పురిటి కష్టాలు పడుతున్నారు.

Most Awaited Movies: క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ల్యాబులకే.. ఎంత పని చేశావే మాయదారి కరోనా!

Most Awaited Movies(1)

Most Awaited Movies: కొవిడ్ లాంగ్ ఎఫెక్ట్ తో సతమతమవుతున్నాయి కొన్ని సినిమాలు. కరోనా ఆంక్షలతో సినిమా షూటింగ్స్ నే చాలా కష్టం మీద పూర్తి చేసిన మేకర్స్.. సినిమా రిలీజ్ చేయాలంటే పురిటి కష్టాలు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు కుదరదనుకున్న ప్రతీసారి వాయిదా వేసేస్తున్నారు. ఒక కొవిడ్ వేరియెంట్ సైలంటయిదనుకుంటే.. మరొకటి పుట్టుకొచ్చి ఫిల్మ్ మేకర్స్ ని నానా తిప్పలు పెడుతోంది.

Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

కొవిడ్ నిద్రపోనివ్వట్లేదు కొందరు ఫిల్మ్ మేకర్స్ ని. డైరెక్ట్ అటాక్ కాదు.. ఇన్ డైరెక్ట్ గా వాళ్లపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎప్పుడో షూటింగ్ షురూ చేసిన సినిమా.. కొవిడ్ కారణంగా పూర్తవ్వడానికే చాలా టైం పట్టింది. అలాంటిది మూవీ రిలీజ్ చేయాలంటే కొవిడ్ కొత్త వేరియంట్స్ తో ఎప్పటికప్పుడు బయపెడుతూనే ఉంది. ట్రిపుల్ ఆర్ నే తీసుకుందాం. జనరల్ గా రాజమౌళి సినిమాలంటేనే లేట్ అవుతాయి. కానీ ట్రిపుల్ ఆర్ ని త్వరగా తీసుకొస్తామన్నారు 2018 మార్చిలో అనౌన్స్ చేసినప్పుడు. కానీ తీరాచూస్తే కొవిడ్ కారణంగా నాలుగు సార్లు పోస్ట్ పన్ అయింది. ఫస్ట్ ప్రకటించిన రిలీజ్ డేట్ 2020 జూలై 30 నుంచి లేటెస్ట్ డేట్ జనవరి 7, 2022 వరకు వాయిదాపర్వం కొనసాగిస్తూనే ఉంది. కొత్తగా ఏ డేట్ ను ఎప్పడూ రాజమౌళి ప్రకటిస్తారో చూడాలి.

Pushpa-Samantha: సామ్ ఊ అంటావా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సంగతి సరేసరి. ఈ సంక్రాంతికి రావడం పక్కా అన్న మేకర్స్.. ఈసారి కూడా రాధేశ్యామ్ ను తప్పించారు. ఒవర్సీస్ ప్లస్ ఇండియా నార్త్ స్టేట్స్ లో ఒమిక్రాన్ విజృంభణతో రాధేశ్యామ్ రిలీజ్ పోస్ట్ పన్ అని తేల్చేశారు. ఈ సినిమా కూడా 2018లోనే ప్రారంభమైంది. ఫస్ట్ 2021 జూలైలో రిలీజ్ అనుకున్న సినిమా.. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ విషయంలో ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అంతా అయ్యాక మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది.

Major: మేజర్ నుంచి ప్రేమ గీతం.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజికల్!

2020 జనవరిలో మొదలైన వెంటనే కొవిడ్ ఎఫెక్ట్ పడింది లైగర్ ఫిల్మ్ కి. అప్పటి నుంచి షూటింగ్స్ పై దెబ్బ పడుతూనే ఉంది. జనరల్ గా వర్క్ స్పీడ్ చేసే పూరీ.. లైగర్ విషయంలో ఇబ్బందిపడ్డారు. అయితే కొవిడ్ ఎఫెక్ట్ లైగర్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండకు, లైగర్ సినిమాకు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ పెరిగింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ యాడ్ అవ్వడం బూస్టప్ నిచ్చింది. ముందు ప్రకటించిన డేట్స్ కి కుదిరకపోవడంతో ఆ ఏడాది ఆగస్ట్ 25ను టార్గెట్ చేసింది లైగర్.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

కేజీఎఫ్ 2ది సేమ్ సిచ్యుయేషన్. 2018లో రిలీజైంది కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్. ఇంతవరకు కేజీఎఫ్ చాప్టర్ 2ని చూపించలేకపోయారు. ఈ ఇయర్ ఏప్రిల్ 14ని ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్ తో పాటూ ఓ ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాయిదాపర్వం కొనసాగించిన విరాటపర్వం ఇప్పటికీ కొత్త డేట్ అనౌన్స్ చేయలేదు. అటు చిరూ, చరణ్ ఆచార్య కూడా కొవిడ్ ఇబ్బందులను ఫేస్ చేస్తూనే ఉంది.

Bangarraju: సంక్రాంతికి వచ్చేస్తున్న సోగ్గాళ్లు.. అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఆశలు!

ఒక్క సౌత్ సినిమాలే కాదు.. నార్త్ ప్రాజెక్ట్స్ కీ కొవిడ్ దెబ్బ గట్టిగానే తగిలింది. వేల కోట్లు ఖర్చుపెట్టే ఇంటర్నేషనల్ సినిమాల సంగతి అలాగే ఉంది. ఎవ్వరనీ వదిలిపెట్టను.. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకిస్తా అన్నట్టు గెటప్ ఛేంజ్ చేసుకుంటూ మరీ భయపెడుతోంది కొవిడ్ వైరస్. 2018లో మొదలైంది బాలీవుడ్ బ్రహ్మాస్త్ర. రణ్ బీర్, అమితాబ్, అలియాతో పాటూ నేషనల్ స్టార్స్ ని వాడుకుని గట్టిగా రావాలనున్న ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆశలను కొవిడ్ కొల్లగొట్టింది. చివరికి బ్రహ్మాస్త్ర పార్ట్ 1తో సెప్టెంబర్ 9న వస్తామని రీసెంట్ గా ప్రకటించారు మేకర్స్. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ ఫృథ్వీరాజ్, షారుఖ్ పఠాన్ ఇలా బాలీవుడ్ చాలా సినిమాలపై కొవిడ్ ఎఫెక్ట్ బలంగా పడింది. అసలు హృతిక్ రోషన్ లాంటి హీరోలు పెద్దగా యాక్టివ్ గా కనిపించనే లేదు.

NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

2009లో వచ్చిన అవతార్ సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడా అని వరల్డ్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ లో అవతార్ ఫ్యామిలీతో వస్తాడంటే… 2009లో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లు కూడా పిల్లలను వేసుకొని వస్తారంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మన జక్కన్నను మించి ప్రాజెక్ట్ కు పీక్ టైమ్ తీసుకునే జేమ్స్ కామరూన్ పై అదనంగా కొవిడ్ దెబ్బ పడింది. సో ఎప్పుడో అనుకున్న సినిమాలన్నీ లేట్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అవతార్ 2 ఈ డిసెంబర్ లో, అవతార్ 3, 4, 5 వరుసగా 2024, 26, 28 సంవత్సరాల్లో రాబోతున్నాయి.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ పై కొవిడ్ ప్రభావం బాగానే పడింది. 2021 జూలై, నవంబర్.. 2022 మే అని చాలా నెలలు మార్చి చివరికి ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మిషన్ ఇంపాజిబుబల్ 7 మేకర్స్. 7 లేట్ కావడంతో ఆటోమేటిక్ గా ఆ ఎఫెక్ట్ మిషన్ ఇంపాజిబుల్ 8పై పడింది. ఈ మూవీ 2023 జూలై 7ను టార్గెట్ చేసింది. హాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌజెస్.. వార్నర్ బ్రదర్స్, మార్వెల్ స్టూడియోస్, యూనివర్సల్ పిక్చర్స్, వాల్డ్ డిస్నీ పిక్చర్స్ సినిమాలన్నీ కొవిడ్ కారణంగా వాయిదాపడుతూనే ఉన్నాయి. ది డ్యూక్, ది బ్యాట్ మ్యాన్, అక్వామెన్ ది లాస్ట్ కింగ్ డమ్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, జురాసిక్ వరల్డ్ డొమినియన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నెక్ట్స్ సినిమాలు.. ఇలా దాదాపు మాక్సిమమ్ హాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ కొవిడ్ దెబ్బతో లేట్ అవుతూనే ఉన్నాయి.