Upcoming Movies: జులై నుండి కౌంట్‌డౌన్ స్టార్ట్.. పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్స్! Countdown Starts From July, Upcoming Movies shooting starts

Upcoming Movies: జులై నుండి కౌంట్‌డౌన్ స్టార్ట్.. పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్స్!

అప్పుడు.. ఇప్పుడు అన్నారు కానీ ఇంతవరకు షురూ చేయలేదు. కానీ సమ్మర్ తర్వాత ఇక ఆగే ప్రసక్తే లేదంటున్నారు. అవును.. ఫ్యాన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తోన్న క్రేజీ కాంబినేషన్స్ కొన్ని పట్టాలెక్కేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి.

Upcoming Movies: జులై నుండి కౌంట్‌డౌన్ స్టార్ట్.. పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్స్!

Upcoming Movies: అప్పుడు.. ఇప్పుడు అన్నారు కానీ ఇంతవరకు షురూ చేయలేదు. కానీ సమ్మర్ తర్వాత ఇక ఆగే ప్రసక్తే లేదంటున్నారు. అవును.. ఫ్యాన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తోన్న క్రేజీ కాంబినేషన్స్ కొన్ని పట్టాలెక్కేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి. ముఖ్యంగా జూలై నెలలో స్టార్స్ సినిమాల ఓపెనింగ్స్ జాతరే జరుగబోతుంది. ఎండలు పూర్తిగా తగ్గాక.. కూల్ కూల్ గా సినిమాలు స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు స్టార్ హీరోలు. జూలై నెలలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మొదలు కానున్నాయి.

Upcoming Movies: మారుతున్న ట్రెండ్.. గ్లామర్ హీరోయిన్స్‌కు అన్నలు అవుతున్న హీరోలు!

రీసెంట్ గా సర్కారు వారి పాట చూపించిన మహేశ్.. త్రివిక్రమ్ సినిమాను జూలై మంత్ నుంచే ప్రారంభిస్తున్నారు. ఆల్ రెడీ అఫీషియల్ ఓపెనింగ్ జరిగిన ఈ మూవీ రెగ్యులర్ షూట్ లో సూపర్ స్టార్ పాల్గొనబోతున్నారు. డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ ను ఫినిష్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు.

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

జూన్ అన్నారు కానీ జూలై నెల నుంచే సెట్స్ పైకెళ్లేలా ఎన్టీఆర్ – కొరటాల సన్నాహాలు చేస్తున్నారు. మే 20 తారక్ బర్త్ డే స్పెషల్ గా కొరటాల ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్న ఎన్టీఆర్.. 8 నుంచి 9 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ కాంబోలో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో పక్కా మాస్ ఎంటర్ టైనర్ గానే కొరటాల ప్లాన్ చేశాడు. ఇందులో పేద విద్యార్ధుల హక్కుల కోసం పోరాడే లీడర్ గా తారక్ కనిపించబోతున్నట్టు టాక్. 2023 సంక్రాంతికి ఈ సినిమాను తీసుకొచ్చేలా మేకర్స్ ఆలోచిస్తున్నారు.

Telugu Movies: ఒకరిపై ఒకరు నెగెటివ్ దుమారం.. బూమ్‌రాగ్ అవుతున్న సినిమాలు!

మారుతి డైరెక్షన్ లో నటించేందుకు ప్రభాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. గత నెలలోనే పట్టాలెక్కుతుందనుకున్న ఈ మూవీ కొన్ని కారణాలతో ఆగింది. అయితే జూలై నెలలోనే ప్రభాస్ మూవీని మారుతి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. కేవలం 50 రోజుల్లోనే ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే స్కెచ్ గీశారు. ఆ మేరకు మారుతీ పక్కా ప్లానింగ్ తో స్క్రిప్ట్ ని, షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు. హారర్ కామెడీనే కానీ డిఫరెంట్ జానర్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని సమాచారం.

Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!

పుష్ప2 కూడా సెట్స్ పైకెళ్లేది జూలైలోనే. 400 కోట్ల బడ్జెట్ తో పుష్ప2ను సుకుమార్ తెరకెక్కించబోతున్నాడు. అసలు సిసలైన పాన్ ఇండియా ఫిల్మ్ గా పుష్ప ది రూల్ రాబోతున్నట్టు చెప్తున్నారు. జూలైలో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించి జనవరి కల్లా క్లోజ్ చేయాలనేది బన్నీ – సుకుమార్ ప్లాన్. ఆ తర్వాత మరో 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ఆపై సమ్మర్ లో పుష్ప2ను థియేటర్స్ కి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్ హిందీ హక్కుల కోసం బాలీవుడ్ లో విపరీతమైన పోటీ నడుస్తోంది.

Telugu Movies: మాస్ ఆడియెన్స్ ఆదరణ లేదా.. రాధేశ్యామ్, ఆచార్య రిజల్టే!

హరీష్ శంకర్ పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ నిజానికి 6 నెలల క్రితమే ప్రారంభం కావాల్సింది కానీ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్టుల వల్ల లేట్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా జూలైలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు. హరీష్ శంకర్ సినిమాలను ఫాస్ట్ గా తెరకెక్కించడంలో దిట్ట. అన్నీ కుదిరితే 6 నెలల్లో పవన్ ప్రాజెక్టుని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది.

South Movies: బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్న.. మ.. మ.. మాస్!

వినోదయ సిత్తం రీమేక్ ను కూడా పవన్ జూలై నెలలోనే షురూ చేయబోతున్నట్టు టాక్. సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం మామ పవన్ తో సాయిధరమ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈమధ్యే ఈ ప్రాజెక్ట్ పై సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కు నేను ఫ్యాన్ ను, ఒక పక్క ఫ్యాన్ గా ఉంటూనే, మరొక పక్క ఆయనను డైరెక్ట్ చేస్తా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.

Flop Movies: భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు.. ఫ్యాన్స్‌కు పీడ కల లాంటి డిజాస్టర్స్!

బాలీవుడ్ జెర్సీ కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడంతో గౌతమ్ తిన్ననూరిని రామ్ చరణ్ వదిలేసారనే ప్రచారం జరిగింది కానీ ఈమధ్యే గౌతమ్ మూవీపై హింట్ ఇచ్చారు చరణ్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే మాస్ సబ్జెక్ట్ ను ఈ డైరెక్టర్ తో చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం శంకర్ మూవీపై ఫోకస్ చేసిన మెగాపవర్ స్టార్.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను ఆగస్ట్ లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Hollywood Movies: ముహూర్తం ఫిక్స్.. ఇండియన్ సినిమాలపై హాలీవుడ్ దండయాత్ర!

బాలకృష్ణ – అనిల్ రావిపూడి.. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ తో ఈ హీరో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య, చంద్రిక రవిలపై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఆపై మరో 20 రోజుల పాటూ బాలకృష్ణ- శృతీహాసన్ లపై యూఎస్ షూట్ షెడ్యూల్ చేసాడు మలినేని. సో ఈ సినిమా జూలైలో పూర్తవుతుందని సమాచారం. సో సెప్టెంబర్ నుంచి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కోసం బాలయ్య వర్క్ చేస్తారు.

Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో 168వ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసేందుకు ఫిక్స్ అయ్యారు. నెల్సన్ తెరకెక్కించిన లాస్ట్ రెండు సినిమాలు డాక్టర్, బీస్ట్ లు కోలీవుడ్ లో మంచి సక్సెస్ నే సాధించాయి. దీనితో రజినీ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ కాస్త ఎగ్జైటింగ్ గానే ఉన్నారు. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానుంది. ఇక ఈ సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రనే సంగీతం అందిస్తున్నాడు.

×