Samantha : మరోసారి సమంత కేసుని విచారించిన కోర్టు.. తీర్పు??

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సమంత విషయంలో ఇష్టమొచ్చినట్టు వీడియోలు ప్రసారం చేశాయి. దీనిపై సీరియస్ అయిన సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది.

Samantha : మరోసారి సమంత కేసుని విచారించిన కోర్టు.. తీర్పు??

Pushpa (1)

Samantha :  సమంత నాగ చైతన్యతో విడిపోయినట్టు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో సమంతని టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ల్స్ కి సమంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సమంత విషయంలో ఇష్టమొచ్చినట్టు వీడియోలు ప్రసారం చేశాయి. దీనిపై సీరియస్ అయిన సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది.

Pushpa : ‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్.. పాట రిలీజ్ ఆ రోజే

కూకట్ పల్లి కోర్టులో మూడు యూట్యూబ్ ఛానల్స్ పై, తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఇంటర్వ్యూ ఇచ్చిన ఓ ప్రముఖుని పై సమంత కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. ఇప్పటికే రెండు సార్లు ఈ కేసుపై వాదనలు జరిగాయి. తాజాగా ఇవాళ సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు వినిపించారు సమంత తరపు న్యాయవాది బాలాజీ. సమంత ప్రతిష్ఠను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని,
సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చెయ్యడం కరెక్ట్ కాదని, సమంత తన కెరీర్ లో అనేక అవార్డులు, రివార్డులు తీసుకుందని కోర్టుకు తెలిపారు.

Puri Jagannadh : ముంబైలో పూరితో సెల్ఫీ లేదని బాధపడిన ఇంటర్ కుర్రాడు.. వీడియో షేర్ చేసిన ఛార్మి

అలాంటి వ్యక్తి పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విదంగా ప్రవరించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలాజీ కోర్టుని కోరారు. అయితే మొన్నటి వాదనల్లో కోర్టు సెలబ్రిటీలు తమ గురించి తామే పబ్లిక్ డొమైన్స్ లో పెడతారు. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడితే ఇలా పరువు నష్టం దావా వేస్తారా అంటూ అడిగింది. దీనికి సమంత తరపున న్యాయవాది సమాధానం ఇస్తూ సమంత నాగ చైతన్య ఇంకా విడాకులు తీసుకోలేదు కేవలం ట్విట్టర్ వేదికగా విడిపోతున్నామని ప్రకటించారు. ఈ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరం. సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాసారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంట్టగట్టారని బాలాజీ కోర్టుకి తెలిపారు. అయినా తమ పిటీషన్ లో ఎక్కడా కూడా సమంత డబ్బులు అడగలేదు కేవలం ఆ వీడియోలకు సంబంధించిన యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరాము. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని, గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని బాలాజీ కోర్టుకి తెలిపారు. అయితే వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్టు మరో వాయిదాలో తీర్పు వెల్లడిస్తామని కూకట్ పల్లి కోర్ట్ తెలిపింది.