ప్రభాస్ గెస్ట్ హౌస్ పై కూకట్ పల్లి కోర్టులో నేడు ట్రయల్

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 06:20 AM IST
ప్రభాస్ గెస్ట్ హౌస్ పై కూకట్ పల్లి కోర్టులో నేడు ట్రయల్

రాయదుర్గంలోని హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌పై ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది. గతంలో రాయదుర్గం పీఎస్‌లో ప్రభాస్‌ సిబ్బందిపై కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభాస్‌ సిబ్బంది గెస్ట్‌హౌస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. సిబ్బందిని శేరి లింగంపల్లి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేశారు. 

గెస్ట్ హౌస్ పై వివాదం ఇదే:
రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఇతరులు అన్యాక్రాంతం చేసి ప్రభాస్ కు అమ్మారని అందుకే తిరిగి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తహసీల్దార్ అంటున్నారు. కాగా, తన గెస్ట్ హౌజ్ ని అధికారులు సీజ్ చేయడంతో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభాస్. రెగ్యులరైజ్ చేస్తే ఆ గెస్ట్ హౌస్ తిరిగి ప్రభాస్ వశమవుతుంది లేదంటే ఆ కట్టడాన్ని అధికారులు కూల్చేస్తారని సమాచారం.

Read: ఇవాళే జగన్ దగ్గరకు టాలీవుడ్ ప్రముఖులు.. వెళ్లేది వీళ్లే!