Covid – 19 Effect : బాలీవుడ్ పై కోవిడ్ ఎఫెక్ట్, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు పోస్ట్ పోన్

బాలీవుడ్ లో కోవిడ్ ఎఫెక్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరస పెట్టి స్టార్లందరూ కోవిడ్ బారిన పడడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తిప్పలు తప్పడం లేదు.

Covid – 19 Effect : బాలీవుడ్ పై కోవిడ్ ఎఫెక్ట్, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు పోస్ట్ పోన్

shuts cinemas

Bollywood : బాలీవుడ్ లో కోవిడ్ ఎఫెక్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరస పెట్టి స్టార్లందరూ కోవిడ్ బారిన పడడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తిప్పలు తప్పడం లేదు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా ఇండస్ట్రీకి మళ్లీ సమస్యలు మొదటికొచ్చాయి. షూటింగ్స్ కి వస్తున్న స్టార్లందరికీ వరసపెట్టి పాజిటివ్స వస్తున్నాయి. అక్షయ్ కుమార్, విక్కీ కౌషల్, ఆలియా భట్, లేటెస్ట్ గా కత్రినా కైఫ్.. ఇలా స్టార్లందరూ కరోనా కి ఎఫెక్ట్ అవ్వడంతో షూటింగ్స్ అన్నీపోస్ట్ పోన్ చెయ్యక తప్పడం లేదు. ఇటు స్టార్లు, అటు కామన్ పీపుల్ అందరూ..కరోనాకి ఎఫెక్ట్ అవ్వడంతో .. ధియేటర్లు క్లోజ్ చేశారు.

దాంతో సినిమా రిలీజ్ లు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. రానా హాథీ మేరా సాథీ సినిమా కోవిడ్ భయానికి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూర్యవన్షీ తో పాటు బంటీ ఔర్ బబ్లీ, అమితాబ్ బచ్చన్ చెహ్రా సినిమాల్ని పోస్ట్ పోన్ చేసేశారు. ఎట్టి పరిస్థితిలో మే 13 రంజాన్ కు సినిమా రిలీజ్ చేస్తానని చెప్పిన సల్మాన్ ఖాన్ రాధే సినిమా రిలీజ్ కూడా ఇప్పుడు డైలమా లోనే పడిపోయింది. ఇలా సినిమాలు మళ్లీ పోస్ట్ పోన్ అవ్వడం స్టార్ట్ అయితే .. ఫ్యూచర్లో మరోసారి డేట్స్ క్లాష్ అవుతాయని తలలు పట్టుకుంటున్నారు సినిమా జనాలు.

కేసులు ఎక్కువవడంతో షూటింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. అసలే పోయిన సంవత్సరం కోవిడ్ తో ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం సినిమాల్ని స్పీడ్ గా లేట్ లేకుండా కంప్లీట్ చెయ్యాలనుకున్న మేకర్స్ కి కోవిడ్ అడ్డం పడిపోతోంది. లిమిటెడ్ యూనిట్ తోనే షూటింగ్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ స్టార్ కాస్ట్, బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ మైథలాజికల్ మూవీ షూటింగ్ ని 25 మంది తోనే చెయ్యాలని రూల్ పెట్టారు డైరెక్టర్ ఓమ్ రౌత్. ఈ సినిమాతో పాటు భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ కూడా భయం గుప్పిట్లోనే షూటింగ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఇండియన్ సినిమాలో మేజర్ షేర్ అయిన బాలీవుడ్ ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ కి గురై మళ్లీ మరింత నష్టాల్లోకి వెళుతోంది.