తెలుగు బిగ్‌బాస్‌ అనైతికం.. ఇదేనా మీరిచ్చే సందేశం: నారాయణ

  • Published By: vamsi ,Published On : September 8, 2020 / 05:07 PM IST
తెలుగు బిగ్‌బాస్‌ అనైతికం.. ఇదేనా మీరిచ్చే సందేశం: నారాయణ

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సంచలన టీఆర్‌పీలతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ ఇప్పటికే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అయితే ఈ షో పై ఇప్పు విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ షో పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ తీవ్రస్థాయిలో సిరియస్ అయ్యారు. ఈ షో వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏం సందేశ‌ం ఇస్తున్నార‌ంటూ ప్ర‌శ్నించారు.



“అంగ‌రంగ వైభ‌వంగా బిగ్‌బాస్ షోను ప్రారంభించారు. అది చూస్తుంటే హిమాల‌యంలో ఉన్న ‌సాంస్కృతిక సంఘాన్ని తీసుకువ‌చ్చి మురికి కుంట‌లో ప‌డేసిన‌ట్లు ఉంది. విజ‌య్ మాల్యా జీవించే భ‌వ‌నాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంత‌కు మించి బిగ్‌బాస్ హౌస్ ఉంది. యువ‌తీ యువ‌కుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వంద‌రోజుల పాటు ఇంట్లోనే ఉంచుతారట.
https://10tv.in/bigg-boss-4-telugu-names-of-16-contestants/
నాగార్జున ఓ యువ‌కుడిని(అభిజిత్‌) పిలిపించి.. ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫొటోల‌ను చూపిస్తాడు. అప్పుడా యువ‌కుడు ఒక‌మ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒక‌మ్మాయితో డేటింగ్ చేస్తా, మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఇదేనా యువ‌తీయువ‌కుల‌కు మీరిచ్చే సందేశం. 100 రోజుల పాటు లోప‌లే ఉంచి బాహ్య ప్ర‌పంచంతో సంబంధాలు లేకుండా చేయ‌డం ఘోరం. ఇలా అనైతిక చ‌ర్య‌ అని నారాయణ అన్నారు.



ఇటువంటి చర్యలను మేం ఖండిస్తున్నాం అని అన్నారు నారాయణ. క‌ళామ‌త‌ల్లికి అన్యాయం చేస్తున్నారని. అవ‌మాన‌ప‌రుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను టీవీ ముందు కూర్చోబెడుతూ సాంస్కృతిక దోపిడీ జ‌రుగుతోందని ఆగ్రహించారు. ఇలాంటి అనైతిక షోల‌ను ప్ర‌జ‌లు ఆద‌రించ‌వ‌‌ద్దని నారాయ‌ణ పిలుపునిచ్చారు.