క్రాల్ ట్రైలర్ : మొసళ్ల మధ్య మహిళ

అలెగ్జాండ్రి అజా డైరెక్షన్‌లో పారామౌంట్ పిక్చర్స్ సమర్పిస్తున్న క్రాల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 10:38 AM IST
క్రాల్ ట్రైలర్ : మొసళ్ల మధ్య మహిళ

అలెగ్జాండ్రి అజా డైరెక్షన్‌లో పారామౌంట్ పిక్చర్స్ సమర్పిస్తున్న క్రాల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది..

హాలీవుడ్‌లో యానిమల్స్ బ్యాక్ డ్రాప్‌తో చాలా సినిమాలు వచ్చాయి. డైనోసార్లపై కూడా సినిమాలొచ్చాయి. ఇప్పుడు మొసళ్ళ నేపథ్యంలో ‘క్రాల్’ అనే సినిమా రాబోతుంది. అలెగ్జాండ్రి అజా డైరెక్షన్‌లో పారామౌంట్ పిక్చర్స్ సమర్పిస్తున్న క్రాల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. ఫ్లోరిడా ప్రాంతాన్ని హరికేన్‌లు చుట్టుముడతాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ ప్రాంతమంతా  నీటమునిగి పోతుంది.అప్రమత్తమైన ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతారు.

కట్ చేస్తే, ఒకామె మాత్రం తన ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. వరద ఉధృతి ధాటికి మొసళ్లు ఆ ఇంట్లోకి కొట్టుకొస్తాయి. వాటిని నుండి ఆమె ఎలా బతికి బయట పడింది? అనే కాన్సెప్ట్‌తో ఉత్కంఠ భరితంగా రూపొందించిన క్రాల్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. క్రెయిగ్ జె ఫ్లోరిస్, శామ్ రైమీ, అలెగ్జాండ్రియా అజా కలిసి నిర్మిస్తున్నారు. జూలై 12న క్రాల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

వాచ్ క్రాల్ ట్రైలర్..