Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

ఎంతో ఇష్టపడి పెల్ళి చేసుకుని కలిసి కొన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసి.. రకరకాల కారణాలతో కలిసుండలేక విడిపోయిన స్టార్లు.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉంటూ..

Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

Bollywood Love Affairs

Bollywood Love Affairs: ఎంతో ఇష్టపడి పెల్ళి చేసుకుని కలిసి కొన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసి.. రకరకాల కారణాలతో కలిసుండలేక విడిపోయిన స్టార్లు.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉంటూ.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఎవరో డీటెయిల్డ్ గా చూద్దాం.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

బాలీవుడ్ లో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఆల్రెడీ పెళ్లిచేసుకుని కలిసుండలేక విడాకులు తీసుకుని మళ్ళీ ప్రేమలో పడి.. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు. రీసెంట్ గా బాలీవుడ్ హీరో, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లి చేసుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ షిబానీ దండేకర్ తో పెళ్లి పీటలెక్కాడు. తన ఫస్ట్ వైఫ్ అధూనా బబానీతో 16 ఏళ్ల పెళ్లినుంచి విడాకులు తీసుకున్నాక షిబానీ కి కనెక్ట్ అయిన ఫర్హాన్.. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్నాడు. లేటెస్ట్ గా షిబానీ, ఫర్హాన్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

త్వరలోనే రెండోసారి పెళ్లి పీటలెక్కబోతున్న మరోజంట.. అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్, మోడల్ మలైకా అరోరా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ డిఫరెన్సెస్ రావడంతో డివోర్స్ తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక అటు మలైకా.. యంగ్ హీరో అర్జున్ కపూర్ ని ఇష్టపడింది. వెకేషన్స్ కి కూడా కలిసివెళ్తున్న ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.

Bollywood Heroins: టాలీవుడ్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఇదీ క్రేజ్ అంటే!

మలైకా అర్జున్ కపూర్ తో పెళ్లికి రెడీ అవుతుంటే.. ఆర్బాజ్ ఖాన్ కూడా జార్జియా ఆండ్రియాతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. తమ ప్రేమను పెళ్లి ద్వారా అఫీషియల్ చేసుకోవాలనుకుంటున్నారు.

Bollywood Stars: ఛలో ఫారిన్.. సెలబ్రిటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్, సుజానే 15 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే ఈ మధ్య హృతిక్ రోషన్ కు సబా ఆజాద్ అనే అమ్మాయితో సమ్ ధింగ్ సమ్ థింగ్ నడుపుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు..ఇద్దరూ కలిసి డిన్నర్లకు కూడా వెళ్లడంతో నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు. లేటెస్ట్ గా ఈ వార్తల్ని స్ట్రెన్తెన్ చేస్తూ.. లంచ్ కి సబాని ఇంటికి తీసుకెళ్లాడు హృతిక్. ఫ్యామిలీతో కలిసి లంచ్ టైమ్ ఫోటోలతో పాటు త్వరలోనే వీళ్ల పెళ్లి కూడా జరుగుతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ తెలుగు ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసిన బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మ.. లియాండర్ పేస్ కూడా రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రియా పిళ్లైని 30ఏళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నారు. వర్కవుట్ అవ్వక.. విడాకులు తీసుకున్నారు. మళ్లీ కొన్నాళ్ల నుంచి కిమ్ శర్మ తో రిలేషన్ లో ఉన్న ఈ జంట త్వరలోనే రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు.