Crazy Combinations: కాంబో సెట్టయ్యిందా.. మళ్ళీ వాళ్ళతోనే మరో సినిమా!

హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ బట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు.

Crazy Combinations: కాంబో సెట్టయ్యిందా.. మళ్ళీ వాళ్ళతోనే మరో సినిమా!

Crazy Combinations

Crazy Combinations: హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ బట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. మాములుగా రిపీట్ కాంబోలు వస్తుంటాయి కానీ ఈమధ్య ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ కాంబినేషన్స్ పెరిగాయి. కొంతమందైతే ఓ సినిమా రిలీజ్ కూడా కాకముందే వెంటనే మరో సినిమా చేస్తామంటున్నారు.

Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?

లైగర్ కాంబో రిపీట్ పై చర్చ హాట్ గానే జరుగుతోంది. పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటూ జరుగుతున్న లైగర్ జర్నీలో ఇద్దరి మధ్య గట్టి బాండిగ్ ఏర్పడింది. పూరి టేకింగ్‌ పై విజయ్‌ కి అవగాహన పెరిగిందని.. విజయ్‌ మాస్ హీరోయిజాన్ని పూరీ మరింత ఎలివేట్ చేయాలనుకుంటున్నారని చెప్తున్నారు. అందుకే ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లైగర్ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ వంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయాల్సి ఉంది రౌడీబాయ్. మరి వాళ్లతో ఎవరితోనైనా పట్టాలెక్కుతాడో.. పూరీనే కావాలంటాడో చూడాలి.

Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?

రికార్డ్స్ కొల్లగొట్టి ప్రైమ్ ఎంట్రీ ఇచ్చేస్తున్న పుష్ప బ్యాచ్ మళ్లీ త్వరలోనే తిరిగి సెట్స్ పైకెళ్లబోతుంది. నిజానికి పుష్ప అనుకున్నప్పుడు ఒక పార్ట్ గానే ప్లాన్ చేశారు. బట్ స్టోరీలో ఉన్న సరుకు, బన్నీ-సుకుమార్ ర్యాపో.. రెండో పార్ట్ తెరకెక్కడానికి కారణమైంది. ఇద్దరి మధ్య ఉన్న బాండిగ్ ఎలాంటిదో పుష్ప థ్యాంక్స్ మీట్ లో అందరూ చూశారు. ఆర్య నుంచి మొదలైన కాంబో ఇప్పుడు నాలుగో సినిమా వరకు వెళ్లింది. కేజీఎఫ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని, హీరో యశ్ ని పాన్ ఇండియా స్టార్స్ చేసిన సినిమా. నిజానికి ప్రశాంత్ నీల్, యశ్ కేజీఎఫ్ స్టోరీ డెవలప్ మెంట్ టైమ్ లోనే ఈ సినిమా రెండు పార్ట్స్ గా చెస్తే బాగుంటుదనుకున్నారు. ఇద్దరి ర్యాపోతో అలాగే చేయాల్సి వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 1 అంత హ్యూజ్ సక్సెస్ కొట్టి కేజీఎఫ్ చాప్టర్ 2 అంచనాలు పెంచేసిందంటే హీరో-డైరెక్టర్ కాంబో వర్కవుట్ వల్లే.

Vijay Devarakonda: రెస్ట్ మోడ్‌లో రౌడీ హీరో.. అంతా కరోనా పుణ్యమే!

వలిమై సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు.. మరో సినిమాకు డైరెక్టర్ హెచ్ వినోద్ తో వర్క్ చేయబోతున్నారు అజిత్. అదీ వెంటనే. ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మించబోతున్నాడు. వినోద్ టేకింగ్ బాగా నచ్చడంతో మరొకరికి కమిట్మెంట్ ఇవ్వకుండా.. సేమ్ కాంబోకే ఓటేశారు అజిత్. త్వరలోనే కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది. అత్రాంగి రే తర్వాత మళ్లీ కలిసి వర్క్ చేస్తున్నారు అక్షయ్ కుమార్-ఆనంద్ ఎల్ రాయ్. రక్షాబంధన్ మూవీ వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోంది. అంతేకాదు అక్షయ్ హీరోగా గోర్కా సినిమాను నిర్మిస్తున్నాడు ఆనంద్. ఓటీటీలో రిలీజైనా అత్రాంగి రే సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఈసారి మాత్రం రక్షా బంధన్ తో థియేటర్స్ లోనే సందడి చేస్తామంటుంది ఈ క్రేజీ కాంబో.

Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

83 ఇచ్చిన కబీర్ ఖాన్ తో మరో సినిమా చేస్తానన్నాడు రణ్ వీర్ సింగ్. కబీర్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఆసమ్ అని ఆయన నెక్ట్స్ మూవీలోనూ తనే హీరో అని ప్రకటించాడు. ఇది కూడా మరో స్పోర్ట్స్ మ్యాన్ బయోగ్రఫీ అనే వార్తలొచ్చాయి. అయితే 83కి అనుకున్నంత బాక్సాఫీస్ కలెక్షన్స్ రాకపోవడంతో కాంబో ఇప్పట్లో రిపీట్ అవడం కష్టమే అంటున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్, హీరో కాంబినేషన్స్ కూడా వెంటవెంటనే సెట్ అయిపోతున్నాయి. జాంబిరెడ్డితో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా వెంటనే హనుమ్యాన్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హై స్పీడ్ లో జరుగుతుంది.