Hero-Director Combo : ఈ కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్.. మళ్ళీ ఈ కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడొస్తాయో..

హీరో తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క డైరెక్టర్ తో కాంబినేషన్ కి మాత్రం ఉండే క్రేజే వేరు. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లొచ్చినా ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే అటు హీరోలు, ఇటు డైరెక్టర్లతో పాటు ఆడియన్స్ కూడా మళ్లీ ఎప్పుడెప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అవుతుందా............

Hero-Director Combo : ఈ కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్.. మళ్ళీ ఈ కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడొస్తాయో..

Hero-Director Combo :  హీరో తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క డైరెక్టర్ తో కాంబినేషన్ కి మాత్రం ఉండే క్రేజే వేరు. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లొచ్చినా ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే అటు హీరోలు, ఇటు డైరెక్టర్లతో పాటు ఆడియన్స్ కూడా మళ్లీ ఎప్పుడెప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. మన టాలీవుడ్ లోనే అలాంటి హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా నాగ్ అశ్విన్, ఓమ్ రౌత్, ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా, ఆ సినిమాల కంటే రాజమౌళితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. అప్పటి వరకూ జస్ట్ హీరోగా ఉన్న ప్రభాస్ కి చత్రపతితో బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఆ తర్వాత బాహుబలితో ప్రభాస్ ని ఏకంగా 2 వేల కోట్ల కలెక్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్ ని చేశారు రాజమౌళి. అందుకే ప్రభాస్ కెరీర్ లో ఎన్ని సినిమాలుచేసినా రాజమౌళితో సినిమా అంటే ఫ్యాన్స్ లో ఆ క్రేజ్, కిక్ లెవలే వేరు. ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా కూడా మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషనే. మరి వీరి కాంబోలో మళ్ళీ సినిమా వస్తుందా అంటే డౌటే.

తెలుగులో సాలిడ్ కాంబినేషన్ బాలయ్య-బోయపాటి. ఇన్నేళ్ల కెరీర్ లో బాలయ్య ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినా బోయపాటి ఎలాంటి మ్యాసివ్ హిట్స్ ఇచ్చినా బాలయ్య-బోయపాటి కలిస్తే ఈ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ ఇచ్చే కిక్కే వేరు. బాలయ్య తన కెరీర్ లో ఇంత వరకూ చేసిన 100 సినిమాలకి మించి బోయపాటి -బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ , అఖండ సినిమాలు అంతకుమించి క్రేజ్ క్రియేట్ చేశాయి. ఈ రేంజ్ మ్యాసివ్ పవర్ ని, పవర్ పుల్ యాక్షన్ ని చూపిస్తూ..బాలయ్య స్టైలిష్ పర్ఫామెన్స్ ని చూపించారు బోయపాటి. అందుకే అటు బాలయ్య ఎంత మంది డైరెక్టర్లతో పనిచేసినా ఇటు బోయపాటి ఎంతమంది స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేసినా బోయపాటి -బాలయ్య కాంబినేషన్ కి ఉండే మ్యాజిక్ వేరంటున్నారు ఫాన్స్. వీరి కాంబోలో మళ్ళీ అఖండ 2 రాబోతుంది.

పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే ఫాన్స్ కి పూనకాలే. ఇక అన్న సినిమా రిలీజ్ అంటే ఆ ఊపే వేరు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా జల్సా, అత్తారింటికి దారేదితో పవన్ కళ్యాణ్ కి వచ్చిన క్రేజ్ వేరు. ఆ సినిమాల్లో డైలాగ్స్ కి, లేటెస్ట్ గా భీమ్లానాయక్ లో తూటాల్లా పేలిన పవర్ స్టార్ డైలాగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది త్రివిక్రమ్ డైరెక్షన్. అందుకే పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కావడమే కాదు ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా ఎప్పుడొస్తుందా అని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు అభిమానులు.

పుష్పతో మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అందుకుని ఇప్పుడు రష్యాలో కూడా రిలీజ్ కు రెడీ అయిన పుష్పలో బన్నీని నెవర్ బిఫోర్ లుక్, పర్ఫామెన్స్ లోఆడియన్స్ కి పరిచయం చేశారు సుకుమార్. మిగతా డైరెక్టర్లెవరూ చూపించని సరికొత్త యాంగిల్ లో బన్నీని ఆడియన్స్ కి పరిచయం చేసిన సుకుమార్ కాంబినేషన్ లో బన్నీ సినిమా అంటే ఇప్పటికీ హాట్ టాపికే. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య2తో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప రికార్డుల్ని తిరగరాసింది. వీళ్లిద్దరి కాంబినేషన్లోనే వస్తున్న పుష్ప 2తో ఈ క్రేజీ కాంబినేషన్ మీద హైప్స్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయాయి.

మహేష్ బాబు.. యాక్టింగ్ వైజ్ కొత్తగా ప్రూవ్ చేస్కోవాల్సింది లేదు. 20 ఏళ్లలో మహేష్ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే .. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు మరో ఎత్తు. మహేష్ కెరీర్ డౌన్ లో ఉన్న టైమ్ లో ఈ రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కొరటాల శివ. ఇంటెన్స్ ఎమోషన్స్ తో పాటు సెటిల్డ్ యాక్టింగ్ మహేష్ ని క్లాసీ గా చూపించారు కొరటాల. ఈ కాంబినేషన్లో సినిమా అంటే కళ్లు మూసుకుని హిట్ అని చెప్పేంత హైప్ వచ్చేసింది. ఆ రేంజ్ లో అటు మహేష్ ఇటు కొరటాల కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. అందుకే ఈ సూపర్ క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే ఇప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ అని ఫీలవుతారు ఆడియన్స్.

 

మహేష్ ని కొరటాల శివ క్లాసీగా చూపిస్తే మహేష్ లోని మరో యాంగిల్ ని, మాస్ పర్ఫామెన్స్ ని చూపించారు పూరీ జగన్. అందుకే మహేష్ కెరీర్ లో కల్ట్ మూవీస్ గా మిగిలిపోయాయి పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు. అప్పటి వరకూ క్యూట్ బాయ్ గా ఉన్న మహేష్ ని .. మాస్ బాబుగా, గ్యాంగ్ స్టర్ గా సరికొత్తగా పరిచయం చేశారు పూరి. పూరి మార్క్ డైలాగ్స్ తో మహేష్ బాబు మేనరిజమ్స్ తో ఈ కాంబినేషన్ సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ పూరీజగన్-మహేష్ కాంబినేషన్లో సినిమా అంటే ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారనడంలో ఏమాత్రం డౌట్ లేదు.

hit 2 success meet : హిట్ 2 సక్సెస్ మీట్ గ్యాలరీ..

ఈ స్టార్ కాంబినేషన్స్ తో పాటు లేటెస్ట్ గా ట్రెండ్ సెట్ చేసిన మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్.. నిఖిల్-చందూమొండేటి. కార్తికేయ అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన ఈ క్రేజీ కాంబినేషన్ లేటెస్ట్ గా కార్తికేయ 2తో రికార్డులు సెట్ చేశారు. అసలు నిఖిల్ కి పాన్ ఇండియా మార్కెట్ లేకపోయినా 15 కోట్లతో తెరకెక్కి ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి 120 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది కార్తికేయ. ఈ సక్సెస్ కి కారణం చందూమొండేటి స్టోరీ, ఎగ్జిక్యూషన్ అయితే నిఖిల్ ఇంటెన్స్ యాక్టింగ్ కూడా. అందుకే ఈ సక్సస్ ఫుల్ క్రేజీ కాంబినేషన్లో ప్లాన్ చేసిన కార్తికేయ 3 కోసం ఫాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు.