OTT Release: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో క్రేజీ కంటెంట్!

రాధేశ్యామ్ రంగంలోకి దిగితే.. జరిగే కలెక్షన్ల విధ్వంసానికి మిగతా ఏ సినిమా అయినా ధియేటర్లో రిలీజ్ అయ్యే సాహసం చెయ్యవు. కానీ రాదేశ్యామ్ కి ప్యార్లల్ గా ఓటీటీ కంటెంట్ మాత్రం పోటీ..

OTT Release: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో క్రేజీ కంటెంట్!

Ott Release

OTT Release: రాధేశ్యామ్ రంగంలోకి దిగితే.. జరిగే కలెక్షన్ల విధ్వంసానికి మిగతా ఏ సినిమా అయినా ధియేటర్లో రిలీజ్ అయ్యే సాహసం చెయ్యవు. కానీ రాదేశ్యామ్ కి ప్యార్లల్ గా ఓటీటీ కంటెంట్ మాత్రం పోటీ పడుతోంది. మార్చి 11న ఆది పినిశెట్టి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా క్లాప్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. పృద్వి ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన క్లాప్ మూవీ సోనీలివ్ లో మార్చి 11న ప్రేక్షకులముందుకొస్తోంది. ధియేటర్లో రిలీజ్అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న రవితేజ ఖిలాడి మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యింది. మాస్ మహారాజా డ్యూయల్ రోల్ లో రమేష్ వర్మ డైరెక్షన్లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఖిలాడి డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో ఆడియన్స్ ముందుకురాబోతోంది.

OTT Release: ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

మార్చి 11నే రిలీజ్ అవుతోన్న మరో ఇంట్రస్టింగ్ మూవీ కడైవాసి. విజయ్ సేతుపతి.. పిచ్చోడి గెటప్ లో ఇంట్రస్టింగ్ రోల్ చేస్తున్న ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం డిస్నీలో తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతున్న సినిమా మారన్. ధనుష్ హీరోగా జర్నలిస్ట్ రోల్ చేస్తూ.. కార్తిక్ నరేన్ డైరెక్షన్లో ధియేటర్లో రిలీజ్ అయిన మారన్ మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి సిద్దమైంది. ప్రతి శుక్రవారం అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ధియేటర్లో కొత్త కొత్త సినిమాలతో పాటు ఇంట్రస్టింగ్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్న ఆహా.. ఈ వారం కూడా కుబూల్ హే అనే క్రేజీ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. క్రైమ్, డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ మార్చి 11 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

తమిళ్ హీరో నిఖిల్ కుమార్ గౌడ పవర్ ఫుల్ రోల్ చేసిన రైడర్ మూవీ కూడా మార్చి 11న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో.. కన్నడ, తెలుగు బైలింగ్వల్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ జీ5లో రిలీజ్ అవుతోంది. దిల్ రాజు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆశిష్, అనుపమపరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన యూత్ ఎంటర్ టైనర్ రౌడీ బాయ్స్ మార్చి 11నే జీ 5లో రిలీజ్ అవుతోంది. సౌత్ కంటెంట్ తోనే ఫుల్ ఎంగేజ్ అయిపోయిన ఓటీటీ ఆడియన్స్ కి బాలీవుడ్ కంటెంట్ కూడా పోటీ ఇస్తోంది. మార్చి 11 ఆల్రెడీ చాలా సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి కాబట్టి మార్చి 10నే అనామికగా వస్తోంది సన్నీలియోన్. యాక్షన్ డ్రామాగా ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో రిలీజ్ అవుతున్న అనామిక ట్రైలర్ తోనే అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

టీజర్స్, ట్రైలర్స్ తో ఇప్పటికే కాంట్రవర్సీ అయిన కాశ్మీర్ ఫైల్స్ మార్చి 11న రిలీజ్ అవుతోంది. మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీ మార్చి 11న ధియేటర్లో రిలీజ్ కాబోతోంది. హాలీవుడ్ క్రేజీ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్ ద ఆడమ్ ప్రాజెక్ట్ మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో, టర్నింగ్ రెడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంటే.. ద లాస్ట్ కింగ్ డమ్ సీజన్ 5 యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. కంప్లీట్ కామెడీ షోగా సూపర్ సక్సెస్ అయిన వీకెండ్ ఫ్యామిలీ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. సైంటిఫిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన అవుట్ లాండర్ సీజన్ 6 ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.