Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్! Crazy Couples and rare combinations In Upcoming Telugu Movies

Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!

కొన్ని కాంబినేషన్స్ భలే కిక్కిస్తాయి. ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ను పరిచయం చేస్తాయి. ఇప్పుడలాగే టాలీవుడ్ సినిమాల్లో కొన్ని కొత్త జంటలు సందడి చేస్తున్నాయి. వీళ్లలో కొందరు కపుల్స్ క్రేజీగా అనిపిస్తే.. మరికొన్ని సినిమాల్లో మాత్రం ఈ హీరో - హీరోయిన్ కలిసారా..

Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!

Telugu New Films: కొన్ని కాంబినేషన్స్ భలే కిక్కిస్తాయి. ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ను పరిచయం చేస్తాయి. ఇప్పుడలాగే టాలీవుడ్ సినిమాల్లో కొన్ని కొత్త జంటలు సందడి చేస్తున్నాయి. వీళ్లలో కొందరు కపుల్స్ క్రేజీగా అనిపిస్తే.. మరికొన్ని సినిమాల్లో మాత్రం ఈ హీరో – హీరోయిన్ కలిసారా.. నిజమేనా అన్న డౌట్స్ పుట్టిస్తాయి.

New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

మహానటిలో చేశారు. ప్రేక్షకులు చూశారు. కానీ సావిత్రిగా కీర్తిసురేశ్ డామినేషన్ ముందు సామ్, విజయ్ తేలిపోయారు. సమంతా, విజయ్ దేవరకొండ రోల్స్ మహానటిని ముందుకు నడిపేందుకు మాత్రమే పనికొచ్చాయి. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి పూర్తి లవబుల్ కపుల్గా ఖుషి చేయబోతున్నారు. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన రౌడీబాయ్ తో రొమాన్స్ చేస్తోంది సమంతా. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ జంట కలిసి నటిస్తోన్న ఖుషి డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. కానీ ఈలోపు మాత్రం క్రేజీ మూవీ కపుల్ గా ఫుల్ వైరల్ అవుతున్నారు వీళ్లు.

Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

విజయ్ దేవరకొండ – పూజా హెగ్డే కాంబినేషన్ కూడా అలాంటిదే. పాన్ ఇండియా హీరోగా ఒకరు.. పాన్ ఇండియా హీరోయిన్ గా మరొకరు.. పూరీ జనగణమన కోసం కలవబోతున్నారు. ఫస్ట్ టైమ్ వీళ్లిద్దరి కాంబినేషన్ వర్కవుట్ కానుంది. అలాగే పూజా పవన్ కల్యాణ్ తో సైతం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో వీళ్లిద్దరి జంట హైలెట్ కానుంది. అటు కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తూనే మహేశ్ తో మరోసారి త్రివిక్రమ్ కోసం వన్స్ మోర్ అంటోంది బుట్టబొమ్మ.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తోన్న సమంతా.. తనకంటే చిన్నోళ్లు.. యంగ్ హీరోలతోనే జట్టు కడుతోంది. ఖుషిలో రౌడీబాయ్ తో మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న యశోద, శాకుంతలం సినిమాల్లోనూ తనకంటే ఏజ్ లో చిన్నవారైన హీరోల కాంబినేషన్ లోనే సామ్ మెరవనుంది. ఇద్దరూ మలయాళీ హీరోలే కావడం విశేషం. యశోదలో ఈ హీరోయిన్ సరసన ఉన్నిముకుందన్ నటిస్తుండగా.. శాకుంతలంలో దేవ్ మోహన్ ఆమె భర్తగా కనిపించబోతున్నాడు.

2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

నవీన్ పొలిశెట్టి, అనుష్కలది డిఫరెంట్ కాంబినేషనే. నవీన్ కంటే వయసులో స్వీటీ పెద్దది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మొత్తానికి ఈ జంట సెట్ అయింది. షూటింగ్ కూడా చేసేస్తోంది. వీళ్ల ఏజ్ కి తగ్గట్టే సినిమా స్టోరీ ఉండబోతున్నట్టు సమాచారం. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి పేరుతో ఈ సినిమా రానుందనే ప్రచారం జరుగుతోంది.

Telugu Films: కొవిడ్‌తో పోయింది పిండుకొనే పనిలో స్టార్స్!

పవన్ కల్యాణ్ సినిమాలో నిధి అగర్వాల్ అన్నప్పుడు ఫ్యాన్స్ కాస్త పెదవి విరిచారు. కానీ క్రిష్ డైరెక్షన్ లో హీరోయిన్ లుక్ అదిరిపోతుందనే పాజిటివ్ టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే హరిహర వీరమల్లు మూవీలో పవర్ స్టార్, నిధి అగర్వాల్ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ ఐటమ్ గర్ల్ నోరా ఫతేహీ సైతం హరిహర వీరమల్లులో కలిసి నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ పాట కూడా ప్లాన్ చేశాడు డైరెక్టర్ క్రిష్.

Telugu Films: ఒకేసారి ఐదు సినిమాలు.. ఈ నలుగురికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ క్రేజీనెస్ వెరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఆరడుగుల కటౌట్ తో జోడీ కట్టే హీరోయిన్ గురించి అభిమానులు చర్చించుకుంటారు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే ఆయన పక్క సీతలా కృతీసనన్ నటించింది. ఈ పెయిర్ కి సంబంధించిన ఒక్క ఫోటో అయినా బయటికొస్తుందేమో అని ఎప్పటినుంచో రెబల్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

గ్లోబల్ స్టార్ తో ప్రశాంత్ నీల్ మూవీ కోసం శృతీహాసన్ జతకట్టడం ఒక లెవెల్ అయితే ప్రాజెక్ట్ కే కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ తో ప్రభాస్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెంచే విషయమే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మారుతి సినిమాల కోసం ప్రభాస్ కి తగ్గ జోడీలను వెతుకుతున్నారు మేకర్స్.

Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!

ప్రభాస్ సలార్ లో నటిస్తోన్న శృతీహాసన్ ఉన్నట్టుండి సీనియర్స్ ఛాయిస్ అనిపించింది. వరుసగా బాలయ్య, చిరంజీవి వంటి సీనియర్స్ తో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తండ్రి కమల్ హాసన్ తో సమానమైన పెద్ద హీరోలతో శృతీ స్టెప్పులేయబోతుందంటే అది క్రేజీనెస్ ను పీక్ కు తీసుకెళ్లేదే. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాతో పాటూ చిరూ – బాబీ సినిమాలోనూ శృతీనే హీరోయిన్.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

25 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కు ఆన్ స్క్రీన్ ట్రీట్ ఇవ్వబోతున్నారు నరసింహ పెయిర్. రజనీ – రమ్యకృష్ణ జంటంటే ఇప్పటికీ కొందరు ఊగిపోతారు. నరసింహలో సూపర్ నెగెటివ్ రోల్ చేసి నీలంబరిగా తనదైన ముద్ర వేసిన రమ్యకృష్ణ.. మళ్లీ ఆ తర్వాత రజనీ కాంబినేషన్ లో కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బీస్ట్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ లో రజినీతో రమ్య స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇందులోనూ సూపర్ స్టార్ ను ఢీకొట్టే లేడీ విలన్ గానే ఉత్తమనటి నటించనున్నారు.

2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!

నాని – నజ్రియా జంట కూడా ఈమధ్య బాగానే సందడి చేస్తోంది. బెంగళూర్ డేస్ టైమ్ లో నజ్రియాను చాలామంది మేకర్స్ టాలీవుడ్ కి తీసుకు రావాలనుకున్నారు. కానీ ఆమె అక్కడ బిజీ అవడం, వెంటనే ఫహాద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకోవడంతో టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపించలేదు. మొత్తానికి నాని, వివేక్ ఆత్రేయ కలిసి నజ్రియాను తెలుగు హీరోయిన్ గా చూపించబోతున్నారు. జూన్ 10నే అంటే సుందరానికి థియేటర్స్ కి రానుంది.

×