Aham Reboot: సుమంత్ ‘అహం రీబూట్‌’.. క్రేజీగా ఫస్ట్ లుక్!

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.

Aham Reboot: సుమంత్ ‘అహం రీబూట్‌’.. క్రేజీగా ఫస్ట్ లుక్!

Aham Reboot

Aham Reboot: సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘అహం రీబూట్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్టార్ రైటర్ విజయంద్ర ప్ర‌సాద్ ఈ ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి.

Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్.. సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెబుతున్నారు. ‘అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్. ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్.

Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..

శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వరుణ్ అంకర్ల సినిమాటోగ్రాఫర్. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న ఈ సినిమాను.. జూన్ మొద‌టివారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.