OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

ఎంత కాదన్నా సినిమాలో హీరోలకు స్క్రీన్ స్పేస్, యాక్టింగ్ స్పేస్ ఎక్కువ. హీరోయిన్లకు అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు దొరకవ్. అందుకే తమ యాక్టింగ్ స్కిల్స్ ని చూపించడానిక..

OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

Ott Series

OTT Series: ఎంత కాదన్నా సినిమాలో హీరోలకు స్క్రీన్ స్పేస్, యాక్టింగ్ స్పేస్ ఎక్కువ. హీరోయిన్లకు అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు దొరకవ్. అందుకే తమ యాక్టింగ్ స్కిల్స్ ని చూపించడానిక ఓటీటీల్ని బాగా వాడుకుకంటున్నారు హీరోయిన్లు. ఇప్పటి వరకూ క్యూట్ గా, స్వీట్ గా.. ముద్దుగా కనిపించిన హీరోయిన్లు.. మర్డర్లు కూడా చేసే టిపికల్ క్యారెక్టర్లు చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

స్పేస్ కావాలి.. స్పేస్ కావాలి అని హీరోయన్లు ఎంత అడుగుతున్నా.. సినిమాల్లో అంత పట్టించుకోవడం లేదు హీరోయిన్లని. అందుకే తమ యాక్టింగ్ స్కిల్స్ ని అపేవాళ్లెవరూ లేని, పరిమితులంటూ లేని ఓటీటీల్ని సెలక్ట్ చేసుకుంటున్నారు. అంతగా ఫేమ్ లేని హీరోయిన్లైతే ఏదో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్లు కూడా ఓటీటీల్లో ఓ రేంజ్ లో ఎక్స్ ప్లోర్ అవుతున్నారు.

Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న సౌత్ హీరోయిన్ శృతిహాసన్.. ఓటీటీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ముకుల్ అభ్యాంకర్ డైరెక్షన్లో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ లో తన యాక్టింగ్ తో ఒకరకంగా షాక్ ఇచ్చింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో అమాయకంగా కనిపిస్తూనే అదిరిపోయే యాక్టింగ్ చేసిన శృతి హాసన్ బెస్ట్ సెల్లర్ సిరీస్ లో బెస్ట్ యాక్టింగ్ తో తనలోని మరో యాంగిల్ ని చూపించింది. బెస్ట్ సెల్లర్ అనే ఈ క్రేజీ థ్రిల్లర్ సిరీస్ శుక్రవారమే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన యామీ గౌతమ్ .. ఇప్పటి వరకూ స్వీట్ క్యూట్ క్యారెక్టర్లతో ఎంటర్ టైన్ చేసింది. కానీ తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఎ థర్స్ డే సినిమాతో ఆడియన్స్ ఫ్యూజులు ఎగరగొట్టేసింది. ప్లే స్కూల్ టీచర్ గా తన డిమాండ్స్ నెరవేరడం కోసం చిన్న పిల్లల్ని కూడా చంపేసే రేంజ్ లో యామీగౌతమ్ చేసిన యాక్టింగ్ అదిరిపోయింది. నిన్న రిలీజ్ అయిన ద థర్స్ డే మూవీలో యామీ టిపికల్ పర్ ఫామెన్స్ కి ఆడియన్స్ ఓ రేంజ్ లో షాకయ్యారు.

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

సౌత్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగాఉన్న హీరోయిన్ రాశిఖన్నా.. బబ్లీ క్యారెక్టర్ల నుంచి బిగ్ టర్న్ తీసుకుంది. సినిమాల్లో చెయ్యలేని టిపికల్ క్యారెక్టర్ ని ఓటీటీలో చేస్తోంది. పవర్ ఫుల్ ఎట్ ద సేమ్ టైమ్ బ్యూటీ విత్ బ్రెయిన్ క్యారెక్టర్ చేస్తోంది రుద్ర వెబ్ సిరీస్ లో. అజయ్ దేవ్ గన్, రాశిఖన్నా లీడ్ రోల్స్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తోనే రాశి చాలా వేరియేషన్స్ చూపించింది. మార్చి 4న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న రుద్రలో తన విశ్వరూపం చూపించబోతోంది రాశిఖన్నా.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

తెలుగు హీరోయిన్లు హిందీ వెబ్ సిరీస్, సినిమాల్లో ఓటీటీలకు విశ్వరూపం చూపిస్తుంటే.. తెలుగు ఓటీటీ యాప్ ఆహా లో.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ భామా కలాపం కూడా తగ్గేదే లే అంటోంది. ప్రియమణి లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ డబ్బు కోసం మర్డర్ చేసి ఆ తర్వత మేనేజ్ చెయ్యడానికి తెగ కష్టపడే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ప్రియమణి తన అల్టిమేట్ యాక్టింగ్ తో థ్రిల్, క్రైమ్, కామెడీ ఎమోషన్స్ తో టిపికల్ క్యారెక్టర్ లో కనిపించింది.