Bigg Boss 5: వెక్కి వెక్కి ఏడ్చిన కంటెస్టెంట్లు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు!

బిగ్ బాస్ షోలో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఎమోషనల్ యాంగిల్ లో కంటెస్టెంట్ల మధ్య పెట్టిన చిచ్చు అందరినీ ఏడిపించేసింది. అందరికీ ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం..

Bigg Boss 5: వెక్కి వెక్కి ఏడ్చిన కంటెస్టెంట్లు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు!

Bigg Boss 5 (3)

Bigg Boss 5: బిగ్ బాస్ షోలో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఎమోషనల్ యాంగిల్ లో కంటెస్టెంట్ల మధ్య పెట్టిన చిచ్చు అందరినీ ఏడిపించేసింది. అందరికీ ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం ఉంటుందని చెప్పిన బిగ్ బాస్.. దానికి నామినేషన్ ప్రక్రియను కండిషన్ గా పెట్టాడు. మనం కోరుకున్నది మన జీవితంలో అంత ఈజీ రాదు అంటూ.. ఏదైనా దక్కించుకోవాలి అంటే దానికి బదులుగా మరేదైనా వదులుకోవాల్సి ఉంటుందని కాన్సెప్ట్ లో ఈ నామినేషన్ సాగించాడు. ఇందు కోసం ఇద్దరిని పవర్ రూమ్ నుండి వచ్చిన ఇద్దరు రెండు లెటర్స్ తీసుకొని అందులో ఒకటే లేఖ వచ్చిన కంటెస్టెంట్ కి ఇవ్వాలి.. మిగతాది చింపేయాలి.

Bigg Boss 5: ఈవారం నామినేషన్‌లో ఆరుగురు.. ఏడిపించేసిన బిగ్‌బాస్!

మొదట పవర్‌ రూమ్‌లోకి వెళ్లిన మానస్‌, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందగా.. లోబో కన్నీళ్లను ఆపుకొని పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. షణ్ను-రవిలకు విశ్వ, సిరి లేఖలు అందగా.. విశ్వ కోసం సిరి తన లవర్ శ్రీహాన్‌ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది. నాకు పుట్టకపోయినా నా దగ్గర ఒక బాబు ఉన్నాడు.. కాబట్టి నీ పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అంటూ విశ్వకు లేఖ త్యాగం చేస్తూ సిరి ఎమోషనల్‌ అయింది. తర్వాత పింకీ- కాజల్‌కు యానీ, మానస్‌ల లేఖలు అందగా.. మానస్‌ తన లేఖను త్యాగం చేశాడు. కానీ మానస్ లేఖ ముక్కలవుతుంటే పింకీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.

Pushpa: తగ్గేదేలే.. ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్‌ లెటర్స్‌ రాగా.. పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్‌.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో రవి దగ్గర తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్‌, లెటర్‌ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్‌ ఇవ్వమని రవిని ఒప్పించాడు. అలా రవి తన లెటర్‌ను చింపి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్‌ ఇంటిని తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీరామ్ ను అలా చూసిన పింకీ ఓదార్చి ముద్దు పెట్టింది.

NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

యానీ- సిరిలకు షణ్ముఖ్‌, కాజల్‌ లెటర్స్‌ రాగా కాజల్‌ గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ కోసం త్యాగం చేశాడు. ఇది చూసి సిరి ఏడ్చేసింది. ‘అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్‌స్పిరేషన్‌ అంటూ గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. ఇక, కెప్టెన్‌ సన్నీకి స్పెషల్‌ పవర్‌ ద్వారా జెస్సీ లెటర్‌ లభించగా అది జెస్సీకి ఇవ్వాలంటే ఆల్‌రెడీ సేవ్‌ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ వెనక్కి అందుకోవాలని బిగ్ బాస్ కండిషన్ పట్టి మరోసారి ఏడిపించాడు. చెప్పాడు. అలా ఈ వారం పూర్తిగా ఎమోషన్స్ మధ్యనే ఎలిమినేషన్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. రవి, లోబో, శ్రీరామ్‌, సిరి, షణ్ముఖ్‌, మానస్‌ నామినేట్‌ అయ్యారు.