Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

తెలుగు బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ వారం దిగ్విజయంగా జరుగుతుంది. బుధవారం జరిగిన 18వ ఎపిసోడ్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. యాంకర్‌ రవికి నేరుగా..

Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

Big Boss 5

Big Boss 5: తెలుగు బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ వారం దిగ్విజయంగా జరుగుతుంది. బుధవారం జరిగిన 18వ ఎపిసోడ్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. యాంకర్‌ రవికి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడయ్యే అవకాశాన్ని కల్పించిన బిగ్‌బాస్‌ అది దక్కించుకోవాలంటే రవి ఒక సీక్రెట్‌ టాస్క్‌ పూర్తి చేయాలని టార్గెట్ చేశాడు. ప్రియ నెక్లెస్‌ రవి దొంగిలించాలని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌ను రవి కూడా సింపుల్ గా పూర్తి చేయగా.. ప్రియ మాత్రం తన నగల డబ్బా కనిపించడం లేదని ఇల్లంతా గోల గోల చేసేసింది.

Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

ఇక సిరి, షణ్ముఖ్‌లు మధ్య మెల్లగా తేడా మొదలవుతుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో షణ్నూ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కడో కొడుతుంది.. వరుస ఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది.. అందుకే బెడ్ మారిపోదాం అనుకుంటున్నా. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది.. ఎందుకో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. అది నాకు నచ్చడం లేదు అంటూ షణ్ముఖ్‌ ఆమె బెడ్డు పక్కన నుంచి వేరే చోటుకు షిఫ్ట్‌ అవ్వాలని అనుకుంటున్నానని జెస్సీతో చెప్పాడు.

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

టాస్కులో భాగంగా షణ్ముఖ్‌, లోబో శ్వేతతో పులిహోర కలిపే క్రమంలో శ్వేత లోబోతో క్లోజ్‌గా ఉండటం చూసిన షణ్ముఖ్ శ్వేతను టాస్క్ లో భాగంగానే నానామాటలు అనాల్సి ఉంది. అయితే అదే ఫ్లోలో భాగంగా షణ్ముఖ్.. ఏదైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది అని టాస్క్ నుండి బయటకెళ్ళి జోక్‌ చేశాడు. కానీ ఆ మాటను ఈజీగా తీసుకోలేకపోయిన శ్వేత హార్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన లోబో కాస్త అసహనానికి లోనయ్యాడు. అనంతరం కాసేపటికే ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారంటూ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.

Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

ఇక టాస్క్ లో భాగంగానే హౌస్ మేట్స్ అంతా కలిసి లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేశారు. వాళ్లిద్దరూ ఒకరికొకరు రింగులు తొడిగించుకుని దండలు మార్చుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా డ్యాన్సులు కూడా చేయడంతో టాస్క్‌ ముగిసినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఇక రాత్రిపూట విశ్వ, హమీదా కాసేపు కబుర్లాడగా.. పింకీ తనకు వీక్‌గా అనిపిస్తుందని హమీదా అంది. ప్రియ లేకపోతే ఆమె ఆడలేదేమో అనిపిస్తుందని చెప్పింది. శ్రీరామ్‌, జెస్సీ అటూఇటూ మాట్లాడతాడని అనిపిస్తారని, అబ్బాయిలలో రవి అందరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తాడని హమీదా అభిప్రాయపడింది.