20 ఏళ్ల తర్వాత ఉపేంద్ర రీ-రిలీజ్

కన్నడ సినీ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర.. 20 సంవత్సరాల తర్వాత రీ-రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : September 24, 2019 / 08:32 AM IST
20 ఏళ్ల తర్వాత ఉపేంద్ర రీ-రిలీజ్

కన్నడ సినీ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర.. 20 సంవత్సరాల తర్వాత రీ-రిలీజ్ కానుంది..

‘ఉపేంద్ర’.. కన్నడ సినీ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా.. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా ఉపేంద్రకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా.. తెలుగులో అదే పేరుతో విడుదల చెయ్యగా.. సూపర్ హిట్ అయింది. ఉపేంద్ర రైటింగ్, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, గురు కిరణ్ సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ప్రేమ, దామిని, రవీనా టాండన్ ముగ్గురూ ఉపేంద్ర మూవీతోనే కన్నడ పరిశ్రమకు పరిచయమయ్యారు.
1999లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 20 సంవత్సరాల తర్వాత రీ-రిలీజ్ కానుంది. కన్నడ ఉపేంద్ర నిర్మాత శిల్పా శ్రీనివాస్ రీసెంట్ ఇంటర్వూలో ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు. ఈ చిత్రం రీమాస్టర్ చేయబడుతోందని, త్వరలో థియేటర్లలోకి విడుదల కానుందని..

Read Also : ఆయుష్మాన్ ఖురానా ‘బాల’ – నవంబర్ 15 విడుదల..

వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపేంద్ర ప్రింట్లను తీసివేయడానికి ఆమె యాంటీ పైరసీ సెల్ మరియు సైబర్ క్రైమ్ బ్రాంచ్ విభాగాలను ఆశ్రయిస్తోంది. ఉపేంద్రతో మాట్లాడిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పారు.