Narappa : మాస్క్ పెట్టుకోమన్న పోలీసులు.. సినిమా చూడండంటున్న సురేష్ ప్రొడక్షన్స్..

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు వెంకటేష్ ‘నారప్ప’ సినిమా స్టిల్‌ను వాడుతూ మాస్క్ పెట్టుకోవాలంటూ సూచించారు..

Narappa : మాస్క్ పెట్టుకోమన్న పోలీసులు.. సినిమా చూడండంటున్న సురేష్ ప్రొడక్షన్స్..

Narappa

Narappa: ఈమధ్య సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు సినిమా పోస్టర్లను సరికొత్త యాంగిల్లో చూస్తున్నారు.. పాపులర్ పోస్టర్లను తమ క్రియేటివిటీని యాడ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలంటూ తమ స్టైల్లో చెబుతున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‌లో బైక్ మీద ఉన్న ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లకు హెల్మెట్స్ పెట్టిన పిక్ ఎంత బాగా వైరల్ అయిందో చూశాం. ఇప్పుడు వెంకటేష్ ‘నారప్ప’ సినిమా స్టిల్‌ను వాడుతూ మాస్క్ పెట్టుకోవాలంటూ సూచించారు.

RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!

క్లైమాక్స్‌లో నారప్ప తన చిన్నకొడుకుతో.. ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు సిన్నప్పా’.. అంటూ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ సీన్ ఇమేజ్‌ని వాడుతూ ఇదే డైలాగ్‌ని తమ స్టైల్లో చెప్పారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీం..

Narappa : వెంకటేష్ కనబడలేదు. ‘నారప్పే’ కనిపించాడు – చిరంజీవి..

‘‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్పా.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’’.. అంటూ మాస్క్ ధరించాలనే వెర్షన్‌లో చెబుతూ ట్వీట్ చెయ్యగా.. ‘‘అవసరమైతే తప్ప బయటకి రావొద్దు అప్పా.. ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో ‘నారప్ప’ చూడండబ్బా’’.. అంటూ సురేష్ ప్రొడక్షన్స్ టీం రీ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.