Pushpa : డీఎస్పీ మరో చార్ట్ బస్టర్.. ‘దాక్కో దాక్కో దాక్కో మేక’..

‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా.. ఇది సస్తాది.. దొరక్కపోతే.. అది సస్తాది..

Pushpa : డీఎస్పీ మరో చార్ట్ బస్టర్.. ‘దాక్కో దాక్కో దాక్కో మేక’..

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పాండమిక్ పరిస్థితి లేకపోతే నేడు (ఆగస్టు 13) న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ అదే రోజు అభిమానులను సర్‌ప్రైజ్ చెయ్యడానికి డిసైడ్ అయ్యారు టీం.

DSP : పుష్ప కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్..

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘పుష్ప’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగులో శివమ్, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళ్‌లో బెన్ని దయాళ్ ఈ పాటను బ్రహ్మాండంగా పాడారు.. జీవిత సారాంశాన్ని తెలియజేసేలా చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..

‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా.. ఇది సస్తాది.. దొరక్కపోతే.. అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే.. హేయ్.. దాక్కో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుక్కుద్ది పీక’.. అంటూ సాగే పాట ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు.. డీఎస్పీ చార్ట్ బస్టర్ లిస్టులో ఒకటిగా నిలుస్తుంది. క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ పార్ట్ 1 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.