Dasara Collections: యూఎస్ బాక్సాఫీస్ వద్ద ధరణిగాడి ఊచకోత..!
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ సినిమాకు ఓవర్సీస్‌లో జనం పట్టం కడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టి నాని క్రేజ్ ఏమిటో ప్రూవ్ చేసింది.

Dasara Collections: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా దసరా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
Dasara Movie: ‘దసరా’పై మహేష్ కామెంట్స్.. సాలిడ్ రిప్లై ఇచ్చిన నాని!

Dasara Collections In US
ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దసరా మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.38 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు జనం పట్టం కడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టి నాని క్రేజ్ ఏమిటో ప్రూవ్ చేసింది.
Dasara : జెర్సీ మూమెంట్ అంటున్న నాని.. దసరా సక్సెస్ మాములుగా లేదు..
ఇక రెండో రోజు ముగిసేసరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన దసరా మూవీ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.