Dasara Movie: ప్రీరిలీజ్ ఈవెంట్‌తో దుమ్ములేపేందుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన ‘దసరా’
నేచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ప్రేక్షకుల్లో బ్రహ్మాండమైన అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు డేట్ అండ్ ప్లేస్‌ను ఫిక్స్ చేశారు.

Dasara Movie Pre-Release Event Date And Venue Locked
Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగ చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో నాని రస్టిక్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Dasara Movie: దసరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అప్పుడేనా..?
కాగా, ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాని అదిరిపోయే రేంజ్లో నిర్వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా దసరా చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై నెక్ట్స్ లెవెల్ బజ్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.
Dasara Movie: నాని సినిమాకు అక్కడ ఫుల్ డిమాండ్.. కెరీర్లోనే రికార్డు బిజినెస్!
దసరా మూవీ ప్రీరిలీజ్ వేడుకను మార్చి 26న అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈమేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోండగా, సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
Get ready for the DHOOM DHAAM DASARA celebrations 🥁🔥#Dasara Grand Pre-Release Event on 26th March at Arts College Ground, Anantapur 🔥
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth @shreyasgroup pic.twitter.com/fiUj4YDNZL
— SLV Cinemas (@SLVCinemasOffl) March 24, 2023